Monday, November 25, 2024
Homeసినిమాకొమరం భీమ్ వేషధారణపై విజయేంద్రప్రసాద్ వివరణ

కొమరం భీమ్ వేషధారణపై విజయేంద్రప్రసాద్ వివరణ

బాహుబలి తర్వాత దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుంటే.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. ఈ సంచలన చిత్రం రెండు పాటలు మినహా షూటింగ్ పూర్తి చేసుకుంది. దేశ వ్యాప్తంగా అక్టోబర్‌ 13న ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాని ఎనౌన్స్ చేసినప్పటి నుంచి ఎన్టీఆర్, చరణ్ అభిమానుల్లోనే కాకుండా సినీ ప్రియులందరూ ఎప్పుడెప్పుడు ఈ సినిమా తెర పైకి వస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే.. ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్‌ల పాత్రలకు సంబంధించిన ప్రచార చిత్రాలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ఎన్టీఆర్‌ పాత్రకు సంబందించిన విషయంలో కొన్ని విమర్శలు వచ్చాయు. ముఖ్యంగా కొమరం భీమ్‌ ముస్లిం టోపీ ధరించడం పై చరిత్రకారులు, కొంత మంది రాజకీయ నాయకులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కొమరం భీమ్‌ ఏనాడు అలా చేయలేదన్నారు. ఈ అంశం పై కొమరం భీమ్‌ వారసులు సైతం మండిపడ్డారు. చరిత్రను వక్రీకరించి ప్రయత్నం చేయొద్దని నిప్పులు చెరిగారు.

అంతే కాకుండా.. ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఆ సన్నివేశాలని తొలగించకుండా రిలీజ్ చేస్తే థియేటర్స్ తగల బెడతామని రాజమౌళికి తగిన బుద్ధి చెప్తామని కూడా హెచ్చరించారు. అయితే.. ఆర్ఆర్ఆర్ టీమ్ మాత్రం స్పందించలేదు. ఈ విషయం పై తాజాగా దర్శకుడు రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్‌ స్పందించారు. తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. కొమరం భీమ్‌ను పట్టుకోవాలని నైజాం ప్రభువులు ప్రయత్నించారు. ఆయన ఎక్కడ ఉన్నారో తెలుసుకునేందుకు ఆ ప్రాంతమంతా జల్లెడ పట్టారు. ఈ సమయంలోనే నైజాం ప్రభువుల నుంచి తప్పించుకోవడానికి భీమ్‌ ముస్లిం యువకుడిగా మారాడు. అందుకే తల పై ముస్లిం టోపీ ధరించారు అని విజయేంద్రప్రసాద్‌ క్లారిటీ ఇచ్చారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్