Friday, March 29, 2024
Homeస్పోర్ట్స్మూడో వన్డే లో మెరిసిన శ్రీలంక

మూడో వన్డే లో మెరిసిన శ్రీలంక

శ్రీలంకతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ లోని చివరి మ్యాచ్ లో ఇండియా ఓటమి పాలైంది. ఇప్పటికే 2-0 తేడాతో ఇండియా సిరీస్ గెల్చుకున్న సంగతి తెలిసిందే. ఆరు మార్పులతో ఇండియా బరిలోకి దిగింది. ఈ మ్యాచ్ లో ఐదుగురు కొత్త ఆటగాళ్లకు జట్టులో స్థానం కల్పించారు. సంజూ శామ్సన్, రాహుల్ చాహర్, నితీష్ రానా, కృష్ణప్ప గౌతమ్, చేతన్ సకారియాలు అంతర్జాతీయ మ్యాచ్ లో తొలిసారి ఆరంగ్రేటం చేశారు. నవదీప్ షైనీ కు కూడా చోటు దక్కింది. సీరీస్ కు ఎంపికైన ప్రతి ఆటగాడికీ  ఆడే అవకాశం కల్పిస్తామని జట్టు కోచ్ గా వ్యవహరిస్తున్న రాహుల్ ద్రావిడ్  గతంలోనే వెల్లడించారు. చెప్పినట్లుగానే  కొత్తవారితో ఆడించారు.

వర్షం కారణంగా మ్యాచ్ ను 47 ఓవర్లకే కుదించారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియా 43.1ఓవర్లలో 225 పరుగులకు ఆలౌట్ అయ్యింది. పృథ్వీ షా 49 బంతుల్లో 8 ఫోర్లతో 49;  సంజూ శామ్సన్ 46 బంతుల్లో  5 ఫోర్లు 1 సిక్సర్ తో 46 ;  సూర్య కుమార్ యాదవ్ 37 బంతుల్లో  7 ఫోర్లతో 40 పరుగులతో రాణించారు. మిగిలిన బ్యాట్స్ మెన్ నిరాశ పరిచారు.

శ్రీలంక 39 ఓవర్లలోనే 7 వికెట్లు కోల్పోయి 227 పరుగులు సాధించి విజయం అందుకుంది. అవిష్క ఫెర్నాండో 98 బంతుల్లో 4ఫోర్లు, 1సిక్సర్ తో 76;   భానుక రాజపక్ష 56 బంతుల్లో 12 ఫోర్లతో 65  పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఫెర్నాండో ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ గా ఎంపికయ్యారు. ఈ సిరీస్ లో రాణించిన ఇండియా ఆటగాడు సూర్య కుమార్ యాదవ్ ప్లేయర్ అఫ్ ద సిరీస్ గెల్చుకున్నాడు.

తన మొదటి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన రాహుల్ చాహర్ 10 ఓవర్లలో 54 పరుగులిచ్చి 3  వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ లో ఆకట్టుకున్న చేతన్ సకారియా రెండు వికెట్లతో రాణించాడు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్