Tuesday, June 16, 2026
HomeసినిమాPushpa 2: 'పుష్ప ఎక్కడ?' సుక్కు సూపర్ ప్లాన్

Pushpa 2: ‘పుష్ప ఎక్కడ?’ సుక్కు సూపర్ ప్లాన్

‘పుష్ప’ సినిమా టాలీవుడ్, బాలీవుడ్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా సినీ అభిమానులను విశేషంగా అలరించింది.  దీంతో  దీని సీక్వెల్ ‘పుష్ప 2’పై భారీ అంచనాలున్నాయి, దీనికి తగ్గట్టుగానే  అందర్నీ ఆకట్టుకనేలా సుకుమార్ తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఖర్చుకు వెనకాడకుండా నిర్మిస్తున్నారు.

పుష్ప సీక్వెల్ చిత్రీకరణ శరవేగంగా జరుగుతున్నా విడుదల ఈ ఏడాది ఉండక పోవచ్చు అనే టాక్ వినిపిస్తోంది. ప్రమోషన్ కార్యక్రమాలు ఇప్పటి నుండే మొదలు పెట్టారు.  ‘పుష్ప ఎక్కడ?’ అంటూ ప్రమోషన్ స్టార్ట్ చేశారు. ఏప్రిల్ 8న బన్నీ పుట్టినరోజు సందర్భంగా టీజర్ రిలీజ్ చేస్తున్నారు. దీనిపై ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు.

భీకర పోరాటం తర్వాత పుష్ప ను పోలీసులు అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ అయిన పుష్ప వెంటనే తప్పించుకుంటాడు. దాంతో పుష్ప ఎక్కడ అంటూ పెద్ద సెర్చ్ ఆపరేషన్ నిర్వహించే సన్నివేశాలు సినిమాలో ఉంటాయని తాజాగా విడుదలైన ప్రోమోను బట్టి అర్థం అవుతుంది. సినిమా ప్రమోషన్ కోసం సుకుమార్ విభిన్నమైన పద్దతిని ఫాలో అవుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular