Tuesday, June 16, 2026
HomeసినిమాPawan Kalyan: పవన్ లిస్ట్ లో రవితేజ డైరెక్టర్

Pawan Kalyan: పవన్ లిస్ట్ లో రవితేజ డైరెక్టర్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ రీ ఎంట్రీలో వరుసగా సినిమాలు చేస్తున్నారు. వకీల్ సాబ్,  భీమ్లా నాయక్  సినిమాలు సక్సెస్ అయ్యాయి.  క్రిష్‌ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘హరిహర వీరమల్లు’ ఎప్పుడో మొదలైనా విడుదల ఎప్పుడో ఎవరూ చెప్పలేని పరిస్థితి.  సీనియర్ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం నిర్మిస్తోన్న ఈ సినిమా దసరాకి కూడా వస్తుందో లేదో అనుమానమే. ఇదిలా ఉంటే.. హరీష్ శంకర్ డైరెక్టర్ గా ఎప్పటి నుంచో వెయిటింగ్ లో ఉన్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. అలాగే సుజిత్ డైరెక్షన్ లో ‘ఓజీ’ని కూడా ఇటీవలే పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు.

ఇప్పుడు మరో డైరెక్టర్ కి పవర్ స్టార్ ఓకే చెప్పారట. రవితేజతో ‘రావణాసుర’  సినిమాను రూపొందించిన సుధీర్ వర్మ తో ఓ సినిమా చేయబోతున్నారట.  సుధీర్ వర్మ స్వయంగా  విషయాన్ని బయటపెట్టాడు. పవన్ కోసం త్రివిక్రమ్ ఓ స్టైలిష్ యాక్షన్ కథ సిద్దం చేసి, దాన్ని సుధీర్ వర్మతో డైరెక్ట్ చేయించాలని ప్లాన్ చేస్తున్నారట. అయితే.. ఈ మూవీ ఎప్పుడు ఉంటుందనేది మాత్రం తనకి తెలియదని అంతా త్రివిక్రమ్ చేతిలో ఉందని చెప్పాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular