పంజాబ్ లో మళ్ళీ ఉద్రిక్త పరిస్థితులు అలుముకుంటున్నాయి. అమృత్ పాల్ సింగ్ పరారీ తర్వాత ఆయన విడుదల చేసిన వీడియోలో సిక్కులు ఏక తాటి మీదకు రావాలని పిలుపు ఇచ్చారు. ఈ నెల 14వ తేదిన భైశాఖి పర్వదినం సందర్భంగా అమృత్ సర్ నుంచి భటిండా వరకు ర్యాలీ నిర్వహించాలన్నారు. ఇందులో భాగంగా సిక్కుల అత్యున్నత మత సంస్థ అఖల్ తఖ్త్ ఈ కార్యక్రమానికి కార్యాచరణ సిద్దం చేస్తోందని సమాచారం. ఈ నేపథ్యంలో ఈనెల 14వ తేదీ వరకు పంజాబ్ పోలీసులకు లీవ్‌లను రద్దు చేశారు.
ఖలిస్తానీ నేత అమృత్‌పాల్ సింగ్ సిక్కులతో భారీ మీటింగ్‌కు పిలుపు ఇచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. గత కొన్ని రోజుల నుంచి అమృత్‌పాల్ పరారీలో ఉన్న విషయం తెలిసిందే. సిక్కు మతస్తుల సంఘం అకాల్ తక్త్ భారీ సభనుఏర్పాటు చేయనున్నది. ఏప్రిల్ 14వ తేదీన బైసాఖి పర్వదినం నేపథ్యంలో ఈ మీటింగ్‌ను నిర్వహించాలనుకుంటున్నారు. అయితే అప్పటి వరకు లీవ్‌లను రద్దు చేయాలని పంజాబ్ డీజీపీ గౌరవ యాదవ్ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే సాంక్షన్ చేసిన లీవ్‌లను రద్దు చేశారు. కొత్త లీవ్‌లు ఇవ్వడంలేదు.
Also Read : Khalistan: అమృత్‌పాల్ సింగ్‌పై లుకౌట్ సర్క్యులర్