Saturday, November 23, 2024
Homeసినిమా‘మిస్సింగ్’ టీమ్ కు బన్నీ వాసు, మారుతి విషెస్

‘మిస్సింగ్’ టీమ్ కు బన్నీ వాసు, మారుతి విషెస్

హర్షా నర్రా, నికీషా రంగ్వాలా, మిషా నారంగ్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “మిస్సింగ్”. ఈ చిత్రాన్ని బజరంగబలి క్రియేషన్స్ పతాకంపై భాస్కర్ జోస్యుల, లక్ష్మీశేషగిరి రావు నిర్మిస్తున్నారు. “మిస్సింగ్” చిత్రంతో శ్రీని జోస్యుల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. దర్శకుడు మారుతి, నిర్మాత బన్నీ వాసు ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరై “మిస్సింగ్” మూవీ టీమ్ కు బెస్ట్ విషెస్ అందించారు.

దర్శకుడు శ్రీని జోస్యుల మాట్లాడుతూ… “మమ్మల్ని సపోర్ట్ చేసేందుకు వచ్చిన అన్నయ్య బన్నీ వాసు, డైరెక్టర్ మారుతి గారికి థాంక్స్. ఈ కొవిడ్ వల్ల 2020 మిస్ అయ్యింది. 2021 కూడా మిస్ కాకుండా ఉండాలని కోరుకుంటున్నా. ఒక థ్రిల్లర్ జోనర్ మూవీ చేయాలనే కోరికతో ఈ స్టోరీ అనుకున్నాం. మన పేరెంట్స్ మనకు సపోర్ట్ చేయడం అనేది చూస్తుంటాం. వాళ్లకున్నదంతా అమ్మేసి మరీ సపోర్ట్ చేసేవాళ్లను కొద్ది మందినే చూస్తాం. మా ఫాదర్ భాస్కర్ గారు, హీరో ఫాదర్ శేషగిరి రావు గారు అలా మా కలను నిజం చేశారు. వాళ్లకు ఎప్పటికీ రుణపడి ఉంటాం”అన్నారు.

హీరోయిన్ మిషా నారంగ్ మాట్లాడుతూ… ఈ రోజు కోసం మా టీమ్ అంతా ఎదురుచూస్తున్నాం. ‘మిస్సింగ్’ ఇకపై మిస్ అవదు. నాకు తెలుగు కష్టమైనా సినిమా టీమ్ షూటింగ్ టైమ్ లో ఎంతో సపోర్ట్ చేశారు. నేను చాలా కంఫర్టబుల్ గా పనిచేశాను అన్నారు.

హీరో హర్ష మాట్లాడుతూ…. బలంగా నమ్మి చేసే పని తప్పకుండా సక్సెస్ అవుతుంది. మా మూవీ మిస్సింగ్ ను మేము అంతే నమ్మి పనిచేశాం. కాబట్టి ష్యూర్ గా విజయం సాధిస్తుంది అన్నారు.

నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ…. గత రెండేళ్లుగా సినిమా ఇండస్ట్రీ కరోనా వల్ల ఇబ్బందులు పడుతోంది. పెద్ద సినిమాల దగ్గర నుంచి చిన్న చిత్రాల దాకా అన్నింటిమీదా ఎఫెక్ట్ పడింది. అనుకున్న డేట్స్ కు సినిమాలను రిలీజ్ చేసుకోలేకపోతున్నాం. అందుకే మా గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ నుంచి ఎన్ని వీలైతే అన్ని సినిమాలను రిలీజ్ చేస్తూ వెళ్తున్నాం. ఒకరికి ఒకరు అండగా నిలబడవలసిన సమయం ఇది. డైరెక్టర్ శ్రీని మా ‘పిల్లా నువ్వు లేని జీవితం’ చిత్రానికి సహాయ దర్శకుడిగా పనిచేశారు. టాలెంటెడ్ టెక్నీషియన్ తను. మిస్సింగ్ మూవీ ట్రైలర్ బాగుంది. విడుదల విషయంలో కాస్త ఓపిక పట్టండి, ఆగస్టు, సెప్టెంబర్ లో పరిస్థితి సెట్ అయితే మళ్ళీ థియేటర్లకు జనం బాగా వస్తారని ఆశిస్తున్నాం అన్నారు.

దర్శకుడు మారుతి మాట్లాడుతూ… మిస్సింగ్ ట్రైలర్ చూస్తే ఒక క్వాలిటీ ఫిల్మ్ కనిపిస్తోంది. ఆర్టిస్టుల ఫర్మార్మెన్స్, టెక్నీషియన్స్ వర్క్ కనిపిస్తోంది. బడ్జెట్ చిన్నదా పెద్దదా కాదు ఓ మంచి సినిమా చేశారని చెప్పగలను. మనల్ని లైఫ్ లో నమ్మాల్సింది తండ్రి. ఆ తండ్రే ప్రోత్సహించి వీళ్లను సినిమాల్లోకి తీసుకొచ్చారు. ఇంతకంటే బ్లెస్సింగ్స్ ఎవరివీ అక్కర్లేదు. అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్