నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం అఖండ. ఈ చిత్రానికి  డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందిన సింహా, లెజెండ్ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అవ్వడంతో అఖండ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాతో హ్యాట్రిక్ సాధించడం ఖాయమని నందమూరి అభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నారు. ఆమధ్య రిలీజ్ చేసిన అఖండ టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ రావడం.. యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ రావడంతో.. అఖండ పై అంచనాలు రెట్టింపు అయ్యాయని చెప్పచ్చు.

కరోనా కారణంగా వాయిదా పడ్డ షూటింగ్ ను ఇటీవలే మళ్ళీ మొదలు పెట్టారు.  ప్రస్తుతం చివరి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటుంది. గత కొన్ని రోజులుగా ఈ సినిమా క్లైమాక్స్ కోసం లొకేషన్ వేటలో బోయపాటి ఉన్నారని.. అది కూడా ఒక దేవాలయంలో ఉంటుందని టాక్ బయటకి వచ్చింది. ఇప్పుడు లొకేషన్ ఫైనల్ అయ్యింది. తమిళనాడులోని విల్లుపురం జిల్లాలోని వెంకటరమణ దేవాలయంలో క్లైమాక్స్ ప్లాన్ చేశారు. ఈ చిత్రం జూలై 21 నుంచి వచ్చే ఆగస్టు 5 వరకు కూడా అక్కడే షూటింగ్ జరుపనున్నారు.

ఈ షూట్ లో బాలయ్యతో పాటుగా ప్రధాన పాత్రధారులు కూడా పాల్గొంటున్నారు. ఈ క్లైమాక్స్ సన్నివేశంలో అఘోర గెటప్ లోనే బాలయ్య పాల్గొంటున్నారని తెలిసింది. దీనితో మరో లెవెల్ మాస్ బాలయ్య ఈ క్లైమాక్స్ లో చూపించనున్నట్టు తెలుస్తుంది. సెప్టెంబర్ లో ఈ చిత్రాన్ని వినాయక చవితి సందర్భంగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. మరి.. భారీ అంచనాలు ఉన్న ‘అఖండ’ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *