పోలీసులే లక్ష్యంగా పాకిస్థాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పోలీసులు సహా నలుగురు దుర్మరణం చెందారు. 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. బలూచిస్తాన్ రాజధాని క్వెట్టాలోని షహ్రా ఈ ఇక్బాల్ ప్రాంతంలో ఉనన ఖంధారి బజార్‌లో ఆగివున్న పోలీసు వాహనం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. క్షతగ్రాతులను వెంటనే క్వెట్టా సివిల్ హాస్పిటల్‌కు తరలించారు. ఈ పేలుడుకు తామే బాధ్యులమని ఇప్పటివరకు ఏ ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు.
కాగా, పోలీసు వాహనమే లక్ష్యంగా ఈ పేలుడు జరిగిందని ఆ ప్రాంత ఎస్పీ హమీద్ ఖంబ్రానీ వెల్లడించారు. పోలీసు వెహికల్ సమీపంలో ఉంచిన ఓ మోటార్ సైకిల్‌లో బాంబు పెట్టి.. దాన్ని రిమోట్ ద్వారా ఆపరేట్ చేశారని ఎఎస్పీ ఆపరేషన్ కెప్టెన్ రిటైర్డ్ జోహైబ్ మోషిన్ వెల్లడించారు. కాగా ఈ ప్రమాదంపై బలూచిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.