Friday, February 28, 2025
HomeTrending Newsనేడు ‘వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం’

నేడు ‘వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం’

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు ప్రకాశం జిల్లలో పర్యటించనున్నారు. మార్కాపురంలో జరిగే ఓ కార్యక్రమంలో వైఎస్సార్ ఈబీసీ నేస్తం కింద రెండో విడత ఆర్ధిక సాయాన్ని విడుదల చేయనున్నారు.  రాష్ట్రవ్యాప్తంగా రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర ఓసీ సామాజిక వర్గాలకు చెందిన 4,39,068 మంది పేద అక్కచెల్లెమ్మలకు 658.60 కోట్ల రూపాయల ఆర్ధిక సాయాన్ని నేడు బటన్‌ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు.

పేద అక్కచెల్లెమ్మలకు (ఈబీసీ) ఏటా రూ. 15,000 చొప్పున 3 ఏళ్ళలో మొత్తం రూ. 45,000 ఆర్ధిక సాయం చేస్తూ వారు సొంత వ్యాపారాలు చేసుకుని వారి కాళ్ళ మీద వారు నిలబడేట్టుగా తోడ్పాటు అందించే ఉద్దేశంతో వైఎస్సార్ ఈబీసీ నేస్తం ప్రారంభించింది.  ఇప్పటికే మేనిఫెస్టోలో చెప్పిన 98.44 శాతం హామీలు నెరవేర్చడంతో పాటు, మేనిఫెస్టోలో చెప్పకపోయినా ప్రతి పేద అక్కచెల్లెమ్మకు మంచి జరగాలని, వారి కుటుంబాలు బాగుండాలని, వారికి తోడుగా ఉండాలని జగన్‌ ప్రభుత్వం అందిస్తున్న కానుక – వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం

నేడు అందిస్తున్న రూ. 658.60 కోట్లతో కలిపి జగన్‌ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఇప్పటివరకు ఈ పథకం ద్వారా అందించిన మొత్తం సాయం రూ. 1,257.04 కోట్లు. ఒక్కో అక్కచెల్లెమ్మకు ఇప్పటివరకు అందించిన సాయం30 వేల రూపాయలకు చేరుకుంది. వివిధ పథకాల ద్వారా అక్కచెల్లెమ్మలకు గత 46 నెలల్లో అందించిన లబ్ధి రూ. 2,25,991.94 కోట్లు (డీబీటీ మరియు నాన్‌ డీబీటీ) అని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్