ఎన్టీఆర్ తో మూవీపై క్లారిటీ ఇచ్చిన వెట్రిమారన్

యంగ్ టైగర్ ఎన్టీఆర్, కోలీవుడ్ డైరెక్టర్ వెట్రిమారన్ కాంబినేషన్లో ఓ మూవీ రానుందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇటీవల ఎన్టీఆర్, ధనుష్ కాంబినేషన్లో భారీ మల్టీస్టారర్ ను వెట్రిమారన్ ప్లాన్ చేస్తున్నాడని.. అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్ లో ప్రచారం జరిగింది. అంతే కాకుండా ఈ ప్రాజెక్ట్ ను త్వరలోనే అనౌన్స్ చేస్తారని కూడా టాక్ వినిపించింది. తర్వాత ఇదేదో గ్యాసిప్ అని తేల్చేశారు. ఇదిలా ఉంటే.. వెట్రిమారన్ తెరకెక్కించిన తమిళ చిత్రం ‘విడుదలై’. దీన్ని  తెలుగులో ‘విడుదల’ అనే టైటిల్ తో గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా అల్లు అరవింద్ ఈ నెల 15న ఈ చిత్రాన్ని విడుదలకు ప్లాన్ చేశారు.

ఈ సందర్భంగా హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా మీట్ లో ఎన్టీఆర్ తో మూవీ గురించి వెట్రిమారన్ క్లారిటీ ఇచ్చారు. అంతే కాకుండా.. తెలుగులో ఏ ఏ హీరోలను కలిశారో కూడా చెప్పారు. ఇంతకీ ఆయన ఏం చెప్పారంటే.. “ఆడుకాలం సినిమా తర్వాత బన్నీని కలిశాను. ఓ కథ అనుకున్నాం కానీ.. కుదరలేదు. మహేష్‌ బాబును కూడా కలిసి కథ చెప్పాను. ఈ ప్రాజెక్ట్ కూడా సెట్ కాలేదు. అసురన్ తర్వాత ఎన్టీఆర్ ను కలిశాను. అనేక విషయాల గురించి మాట్లాడుకున్నాం. ఆయనతో సినిమా చేసే అవకాశం ఉంది కానీ.. టైమ్ పడుతుంది. అయితే.. అది సోలో హీరో మూవీనా..? మల్టీస్టారరా..? అనేది కాలమే సమాధానం చెబుతుంద”ని వెట్రిమారన్ తెలియచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *