Saturday, June 13, 2026
HomeసినిమాDharuveyy Ra Song: 'రామబాణం' సెకండ్ సింగిల్ విడుదలకు ముహుర్తం ఫిక్స్

Dharuveyy Ra Song: ‘రామబాణం’ సెకండ్ సింగిల్ విడుదలకు ముహుర్తం ఫిక్స్

గోపీచంద్, శ్రీవాస్ కాంబినేషన్లో లక్ష్యం, లౌక్యం చిత్రాలు రూపొందాయి. ఇప్పుడు వీరద్దరూ కలిసి చేస్తున్న మూడవ చిత్రం ‘రామబాణం’. ఇందులో జగపతి బాబు, ఖుష్భూ కీలక పాత్ర పోషిస్తుండడం విశేషం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం పై టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల ఈ చిత్రానికి సహ నిర్మాత. యాక్షన్ అంశాలతో కూడిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ‘రామబాణం’ గ్లింప్స్‌, ఫస్ట్ సింగిల్ ఐఫోన్ సాంగ్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా ఈ చిత్రం సెకండ్ సింగిల్ దరువెయ్యరా పాటని ఏప్రిల్ 14న కర్నూల్ అవుట్ డోర్ స్టేడియంలో జరిగే గ్రాండ్ ఈవెంట్ లో లాంచ్ చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. గోపిచంద్, డింపుల్ హయాతీ పండగ వాతావణంలో సంప్రదాయ దుస్తులలో గ్రేస్ ఫుల్ గా డ్యాన్స్ చేస్తున్న అనౌన్స్ మెంట్ పోస్టర్ ఆకట్టుకుంది. భూపతి రాజా ఈ చిత్రానికి కథను అందించగా, వెట్రి పళని స్వామి సినిమాటోగ్రఫీ, మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. మధుసూదన్ పడమటి డైలాగ్స్ అందించగా, ప్రవీణ్ పూడి ఎడిటర్. ఈ చిత్రంలో సచిన్ ఖేడేకర్, నాజర్, అలీ, రాజా రవీంద్ర, వెన్నెల కిషోర్, సప్తగిరి, కాశీ విశ్వనాథ్, సత్య, గెటప్ శ్రీను, సమీర్, తరుణ్ అరోరా తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. సమ్మర్ కానుకగా మే 5న రామబాణం విడుదలకు సిద్ధమవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular