Monday, June 15, 2026
HomeసినిమాChelli Vinave Song: 'బిచ్చగాడు 2' నుండి 'చెల్లి వినవే' సాంగ్ రిలీజ్

Chelli Vinave Song: ‘బిచ్చగాడు 2’ నుండి ‘చెల్లి వినవే’ సాంగ్ రిలీజ్

విజయ్ ఆంటోని కెరీర్ లో మరచిపోలేని చిత్రం ‘బిచ్చగాడు’. తమిళ్ తో పాటు తెలుగులోనూ ఈ చిత్రం చాలా పెద్ద విజయం సాధించింది. ఆ చిత్రానికి సీక్వెల్ గా విజయ్ ఆంటోని స్వీయ దర్శకత్వంలో ‘బిచ్చగాడు-2’ తో వస్తున్నాడు. ఆ మధ్య బిచ్చగాడు 2 నుంచి విడుదల చేసిన ఫస్ట్ లిరికల్ సాంగ్ కు అనూహ్య స్పందన వచ్చింది. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి సెకండ్ సాంగ్ రిలీజ్ చేసింది మూవీ టీమ్. ‘చెల్లి వినవే.. నా తల్లీ వినవే.. నీ అన్నను కానూ అమ్మను నేను.. చిట్టీ వినవే.. నా బుజ్జీ కన్నవే.. నీ పుట్టూ మచ్చై ఉంటా తోడూ’ అంటూ సాగే ఈ గీతాన్ని భాష్యశ్రీ రాయగా అనురాగ్ కులకర్ణి ఆలపించాడు. సంగీతం విజయ్ ఆంటోనీ అందించాడు.

అనాథలైన హీరో, అతని సోదరి చిన్నతనంలో అనుభవించిన కష్టాలు, సమస్యల నేపథ్యంలో సాగే గీతంలా కనిపిస్తోంది. ‘బ్రతుకులే వీధిపాలైనా.. నిన్ను రథములో తిప్పుకోనా.. భూమి బద్దలైపోయి రెండు ముక్కలైపోయినా.. ఊయలల్లే నేను మారి నిన్ను మోయనా.. ’ఆర్ద్రతతో నిండిన సాహిత్యంతో వినగానే హృదయం బరువెక్కేలా ఉందీ పాట. బిచ్చగాడు2 లో ఇదే హైలెట్ సాంగ్ లానూ కనిపిస్తోంది. ప్రతి ఒక్కరినీ కదిలించేలా పూర్తి ఎమోషనల్ టచ్ తో ఉంది. విజయ్ ట్యూన్ ను అద్భుతమైన గాత్రంతో ప్రాణం పోశాడు అనురాగ్ కులకర్ణి.

విజయ్ ఆంటోనీ ఈ చిత్రంలో హీరోగా నటించడమే కాకుండా ఎడిటింగ్, మ్యూజిక్ ను కూడా అందించారు. అలాగే తన సొంత బ్యానర్ విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పోరేషన్ లో ఈ చిత్రాన్ని నిర్మించారు. విజయ్ ఆంటోని సరసన కావ్య థాపర్ కథానాయికగా నటిస్తోంది. ఈ మూవీ అతి త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular