ఐపీఎల్ లో నేడు జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ పై గుజరాత్ జెయింట్స్ 6 వికెట్లతో విజయం సాధించింది. పంజాబ్ ఇచ్చిన 154 పరుగుల విజయ లక్ష్యాన్ని మరో బంతి మిగిలి ఉండగానే చేరుకుంది. నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి 18రన్స్ మాత్రమే ఇచ్చి రెండు కీలక వికెట్లు పడగొట్టిన గుజరాత్ బౌలర్ మోహిత్ శర్మకు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.
మొహాలీలోని ఐఎస్ బింద్రా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో గుజరాత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇన్నింగ్స్ రెండో బంతికే పంజాబ్ ఓపెనర్ ప్రభ్ సిమ్రాన్ డకౌట్ అయ్యాడు, జట్టు స్కోరు 28 వద్ద మరో ఓపెనర్, కెప్టెన్ శిఖర్ ధావన్ (8) కూడా వెనుదిరిగాడు. మాథ్యూ షార్ట్-36; భానుక రాజపక్ష-20; జితేష్ శర్మ-25; శామ్ కర్రన్-22; షారుఖ్ ఖాన్-22 పరుగులు చేశారు. నిర్ణీత 20ఓవర్లలో 8వికెట్లకు 153 పరుగులు చేసింది.
గుజరాత్ బౌలర్లలో మోహిత్ 2, షమీ, జాషువా లిటిల్, అల్జారీ జోసెఫ్, రషీద్ ఖాన్ తలా ఒక వికెట్ పడగొట్టారు.
గుజరాత్ తొలి వికెట్ (వృద్దిమాన్ సహా-30) కు 48 రన్స్ సాధించింది.మరో ఓపెనర్ శుభ్ మన్ గిల్ రాణించి 49 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్సర్ తో 67; సాయి సుదర్శన్-19 పరుగులు చేయగా, కెప్టెన్ పాండ్యా (8) మరోసారి నిరాశ పరిచాడు. డేవిడ్ మిల్లర్ (17); రాహుల్ తెవాటియా(5) నాటౌట్ గా నిలిచారు.
పంజాబ్ బౌలర్లలో అర్ష్ దీప్ సింగ్, రబడ, హర్ ప్రీత్ బ్రార్, శామ్ కర్రన్ తలా ఒక వికెట్ సాధించారు.