Sunday, November 24, 2024
Homeస్పోర్ట్స్IPL: PBKS Vs. LSG: హోరాహోరీ పోరులో పంజాబ్ దే విజయం

IPL: PBKS Vs. LSG: హోరాహోరీ పోరులో పంజాబ్ దే విజయం

ఐపీఎల్ లో నేడు జరిగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ పై పంజాబ్ కింగ్స్ రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. లక్నో అటల్ బిహారీ వాజ్ పేయి స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ బౌలింగ్ ఎంచుకుంది. శిఖర్ ధావన్ అనారోగ్యం కారణంగా శామ్ కర్రన్ పంజాబ్ కు సారధ్యం వహించాడు.

లక్నో తొలి వికెట్ (కేల్ మేయర్స్-29) కు 53 పరుగులు చేసింది. దీపక్ హుడా (2) త్వరగా పెవిలియన్ చేరాడు, కునాల్ పాండ్యా 18 పరుగులు చేయగా, హిట్టర్ పూరన్ డకౌట్ అయ్యాడు. స్టోనిస్ 15 రన్స్ చేసి వెనుదిరిగాడు. కెప్టెన్ రాహుల్ 56 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్సర్ తో 74 పరుగులు చేసి ఆరో వికెట్ గా ఔటయ్యాడు.  క్రిష్ణప్ప గౌతమ్(1), యుద్ వీర్ సింగ్ (డకౌట్) విఫలం కాగా, అయూష్ బదోనీ-5;  రవి బిష్ణోయ్- 3 పరుగులతో నాటౌట్ గా నిలిచారు.

పంజాబ్ బౌలర్లలో శామ్ కర్రన్ 3; రబడ 2; అర్ష్ దీప్ సింగ్, హర్ ప్రీత్ బ్రార్, సికందర్ రాజా తలా ఒక వికెట్ పడగొట్టారు.

లక్ష్య ఛేదనలో పంజాబ్ స్కోరు బోర్డు మొదలు కాకకుందే ఓపెనర్ అథర్వ తైడే వికెట్ కోల్పోయింది. మరో ఓపెనర్ ప్రభ్ సిమ్రాన్ సింగ్ (4) ఔటయ్యాడు. మాథ్యూ షార్ట్ -34; హర్ ప్రీత్ సింగ్ భాటియా-22 చేయగా… సికందర్ రాజా బాధ్యతాయుతంగా ఆడి 41 బంతుల్లో 4  ఫోర్లు, 3 సిక్సర్లతో 57 పరుగులు సాధించాడు. శామ్ కర్రన్ (6); జితేష్ శర్మ (2)  విఫలం కాగా, షారుఖ్ ఖాన్ సూపర్ ఇన్నింగ్స్ ఆడి 10 బంతుల్లో ఒక ఫోర్ రెండు సిక్సర్లతో 23 పరుగులు సాధించి నాటౌట్ గా నిలిచి విజయంలో కీలక భూమిక పోషించాడు.

లక్నో బౌలర్లలో యుధ్వీర్ సింగ్, మార్క్ వుడ్, రవి బిష్ణోయ్ తలా రెండు, కృనాల్ పాండ్యా, కృష్ణప్ప గౌతమ్ చెరో వికెట్ సాధించాడు.

సికందర్ రాజా కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్