Tuesday, June 16, 2026
HomeసినిమాAgent Run Time: 'ఏజెంట్' రన్ టైమ్ ఎంత..?

Agent Run Time: ‘ఏజెంట్’ రన్ టైమ్ ఎంత..?

అఖిల్ నటించిన భారీ పాన్ ఇండియా మూవీ ‘ఏజెంట్’. సురేందర్ రెడ్డి తెరకెక్కించిన మూవీ పై రోజురోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. ఈ నెల 15 వరకు షూటింగ్ జరుపుకోవడంతో ఈ మూవీ పై బజ్ లేదనే టాక్ వచ్చింది. అయితే.. ఎప్పుడైతే హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టారో అప్పటి నుంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇక విజయవాడలో అఖిల్ రియల్ స్టంట్ చేయడంతో యూత్ లో ఈ సినిమా పై మరింత క్రేజ్ పెరిగింది. ప్రమోషన్స్ లో స్పీడు పెంచడంతో బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సాధించడం ఖాయమనే టాక్ బలంగా వినిపిస్తుంది.

ఇక అసలు విషయానికి వస్తే… ఈ మూవీ నిడివి ఎక్కువ కాకుండా.. తక్కువ కాకుండా కరెక్ట్ గా 2 గంటల 30 నిమిషాలకు ఫిక్స్ చేశారని తెలిసింది. సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకు ఎక్కడా బోర్ అనేది లేకుండా చాలా స్పీడుగా దూసుకెళుతుందట. అలాగే సినిమా చూస్తున్నంత సేపు వావ్ అనిపించేలా  సీన్స్ ఉన్నాయని.. ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతాయని అంటున్నారు మేకర్స్. అఖిల్ పడ్డ కష్టం ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుందని.. తెలుగు ప్రేక్షకులు థ్రిల్ ఫీలయ్యే హాలీవుడ్ రేంజ్ మూవీ అని.. రన్ టైమ్ కూడా ఏజెంట్ కు ప్లస్ అవుతుంది అనేది మేకర్స్ ఆలోచన.

ఈ సినిమా పై అఖిల్ అలాగే అక్కినేని అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. హైదరాబాద్ లో భారీగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేశారు. ఈ ఈవెంట్ కు ఎన్టీఆర్, చరణ్‌ వస్తారని ప్రచారం జరిగింది. దీంతో ప్రచారంలో ఉన్నట్టుగా ఎన్టీఆర్, చరణ్ గెస్టులుగా వస్తారా..? లేక వేరే హీరో వస్తారా..? అనేది ఆసక్తిగా మారింది. 28న వస్తున్న మూవీతో బ్లాక్ బస్టర్ సాధిస్తున్నామని అనిల్ సుంకర గట్టి నమ్మకంతో ఉన్నారు. మరి.. ఏజెంట్ నమ్మకాన్ని ఎంత వరకు నిజం చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular