Wednesday, June 17, 2026
HomeసినిమాSantosh Shoban: సంతోష్ శోభన్ కు ఈసారైనా సక్సెస్ వస్తుందా..?

Santosh Shoban: సంతోష్ శోభన్ కు ఈసారైనా సక్సెస్ వస్తుందా..?

అందరికీ నచ్చే అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌లను రూపొందించడంలో ప్రసిద్ది చెందిన ప్రొడక్షన్ హౌస్ స్వప్న సినిమా. అలాగే నందిని రెడ్డి ఫీల్ గుడ్ ఎమోషన్స్‌తో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లను రూపొందించడంలో స్పెషలిస్ట్. కథనంలో తాజాదనాన్ని తీసుకురావడానికి సంతోష్ శోభన్, మాళవిక నాయర్ ఉన్నారు. ‘ఏప్రిల్ 20న మీట్ రిషి & ఆర్య ఇన్ ఇటలీ’ అని ఒక ప్లజంట్ వీడియో ద్వారా మేకర్స్ అనౌన్స్ చేశారు. ఇది నెక్స్ట్ ప్రమోషనల్ స్టఫ్ . గ్లింప్స్ లో విభిన్న మనస్తత్వాలు కలిగిన రిషి, ఆర్యల మధ్య అందమైన లవ్లీ రిలేషన్ షిప్ ని ప్రజంట్ చేస్తోంది. వారి ప్రయాణం ఆసక్తికరంగా వుంది.

వీడియోలోని చివరి భాగం కంప్లీట్ హ్యూమరస్ గా వుంది. నందినీ రెడ్డి ఆర్య, రిషి పాత్రలను అద్భుతంగా ప్రజంట్ చేశారు. సంతోష్ శోభన్, మాళవిక నాయర్ తమ పాత్రలను ఆకట్టుకునేలా చేశార్. మిక్కీ జె మేయర్ సంగీతం బిగ్ ప్లస్. మేకర్స్ ఇప్పటి వరకు రెండు పాటలను విడుదల చేసారు. రెండూ బ్లాక్ బస్టర్స్ అయ్యాయి.

అన్నీ మంచి శకునములే చిత్రంలో రాజేంద్రప్రసాద్, రావు రమేష్, నరేష్, గౌతమి, సౌకార్ జానకి, వాసుకి పలువురు ప్రముఖ నటీనటులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మిత్ర విందా మూవీస్‌తో కలిసి ప్రియాంక దత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. దావూద్ స్క్రీన్ ప్లే అందించగా, లక్ష్మీ భూపాల డైలాగ్ రైటర్. దివ్య విజయ్ ఎగ్జిక్యూటివ్ నిర్మాత. మే 18న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇటీవల కాలంలో సంతోష్ శోభన్ నటించిన సినిమాలు ప్లాప్ అవుతున్నాయి. మరి… ఈ సినిమా అయినా సంతోష్ కి సక్సెస్ అందిస్తుందో లేదో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular