దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. ఇవాళ కొత్త కేసుల్లో కాస్త తగ్గుదల కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా 10 వేలకు పైనే కేసులు నమోదుకాగా.. తాజాగా ఆ సంఖ్య 7 వేలకు దిగొచ్చింది. గత 24 గంటల వ్యవధిలో 7,633 కేసులు బయటపడ్డాయి.
కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం…
24 గంటల వ్యవధిలో చేసిన కరోనా టెస్టులు : 2,11,029
పాజిటివ్‌గా తేలిన కేసులు : 7,633
ప్రస్తుతం దేశంలో ఉన్న యాక్టివ్ కేసులు : 61,233
మొత్తం కరోనా బారిన పడిన వారి సంఖ్య : 4.47 కోట్లు (4,48,34,859)
మరణాలు : 11
మొత్తం మరణాల సంఖ్య : 5,31,152
ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య : 4,42,42,474
ఇక ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల్లో 0.14 శాతం యాక్టివ్‌గా ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. రికవరీ రేటు 98.68 శాతం, మరణాల రేటు 1.18 శాతంగా ఉందని పేర్కొంది. ఇప్పటి వరకు 220.66 కోట్ల (220,66,27,271) కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు వెల్లడించింది.