Wednesday, June 17, 2026
HomeTrending NewsBhagya nagaram: సంపన్న నగరాల జాబితాలో హైదరాబాద్

Bhagya nagaram: సంపన్న నగరాల జాబితాలో హైదరాబాద్

పేరుకు తగినట్టుగానే భాగ్య నగరంలో సంపన్నులు పెరిగిపోతున్నారు. ఒక మిలియన్ అమెరికన్ డాలర్లు అంటే ఎనిమిది కోట్ల రూపాయల పైమాటే. ప్రస్తుతం ఒక్క హైదరాబాద్ నగరంలో ఏకంగా పదకొండు వేల మంది మిలియనీర్లు ఉన్నారు. ప్ర‌పంచంలో అత్యంత సంప‌న్న న‌గ‌రాల జాబితాలో భాగ్య‌న‌గ‌రం చోటు ద‌క్కించుకుంది. 2012 నుంచి 2022 పదేళ్ల కాలంలో హైదరాబాద్ లో హై నెట్ వర్త్ ఇండివిడ్యువల్స్ సంఖ్య భారీగా పెరిగినట్లుగా తాజాగా విడుదలైన నివేదిక వెల్లడించింది. ప్రపంచంలోనే అత్యంత సంపన్న నగరాల నివేదిక 2023ను హెన్లీ అండ్ పార్టనర్స్ వెల్లడించింది. ఈ జాబితాలో మొత్తం 97 నగరాలు పట్టణాలు చోటు దక్కించుకున్నాయి. జాబితాలో మొదటి స్థానం అమెరికాలోని న్యూయార్క్ సిటీ నిలవగా. రెండో స్థానంలో జపాన్ రాజధాని టోక్యో నిలిచింది. న్యూయార్క్ నగరంలో 340000 మంది మిలియనీర్లు ఉండగా.

టోక్యోలో 290300 మంది ఉన్నట్లుగా పేర్కొన్నారు. మూడో స్థానంలో శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియా (2.85 లక్షలు) నాలుగో స్థానంలో లండన్ (2.58 లక్షలు) ఐదో స్థానంలో సింగపూర్ (240100) నిలిచింది. తర్వాతి స్థానాల్లో…లాస్ ఏంజెలిస్ (205400) (అమెరికా).. హాంకాంగ్ (129500)..బీజింగ్ (12800) (చైనా).. షాంఘై (127200) (చైనా)..సిడ్నీ (126900) (ఆస్ట్రేలియా)నిలిచాయి.ఇక మన దేశానికి వచ్చేసరికి దేశ ఆర్థిక రాజధాని ముంబయి మొదటి స్థానంలో నిలిచింది. ప్రపంచ జాబితాలో చూసినప్పుడు 59400 మంది మిలియనీర్లతో 21వ స్థానంలో నిలిచింది. తర్వాత ఢిల్లీ (30200) 36వ స్థానంలో బెంగళూరు (12600) 60వ స్థానంలో కోల్ కతా (12100) 63వ స్థానంలో హైదరాబాద్ (11100) మందితో 65వ స్థానంలో నిలచింది.

Ambedkar Statue Unveiled

దేశ ఆర్థిక రాజధాని ముంబై లో మిలియనీర్ల సంఖ్య 59400 గా ఉంటే… దేశ రాజధాని ఢిల్లీ లో మాత్రం 30200 మంది మిలియనీర్లు ఉన్నారు. దేశ ఐటి రాజధాని బెంగళూర్ లో హైదరాబాద్ కంటే కొంత ఎక్కువగా 12100 మంది మిలియనీర్లు ఉన్నారు. ప్రపంచంలోని అత్యంత సంపన్న నగరాల జాబితాలో హైదరాబాద్ 65 స్థానంలో ఉంది. గత కొన్ని సంవత్సరాల్లో నగరంలో సంపన్నులు సంఖ్య గణనీయంగా పెరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular