Wednesday, June 17, 2026
HomeసినిమాChiranjeevi: చిరు ఈ డైరెక్టర్స్ కి ఓకే చెప్పారా..?

Chiranjeevi: చిరు ఈ డైరెక్టర్స్ కి ఓకే చెప్పారా..?

చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించి ఫుల్ జోష్ లో ఉన్నారు. ప్రస్తుతం ‘భోళా శంకర్’ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. అనిల్ సుంకర నిర్మిస్తున్న భోళా శంకర్ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రాన్ని ఆగష్టు 11న విడుదల చేయనున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు. అయితే… మూవీ తర్వాత ఎవరితో సినిమా చేయనున్నాడు అనేది ప్రకటించలేదు కానీ.. రోజుకో వార్త బయటకు వస్తుంది. అయితే.. చిరంజీవి మూడు సినిమాలకు ఓకే చెప్పారని టాక్ వినిపిస్తుంది.

ఇంతకీ చిరు ఓకే చెప్పిన ఆ మూడు సినిమాలు ఎవరితో అంటే… ముందుగా డైరెక్టర్ వశిష్ట్ పేరు వినిపిస్తుంది. చెప్పిన స్టోరీ నచ్చడంతో చిరంజీవి వెంటనే ఫుల్ స్టోరీ రెడీ చేయమని చెప్పారట. ఇది సోషియో ఫాంటసీ మూవీ అని… ప్రస్తుతం వశిష్ట్ ఈ స్టోరీ రెడీ చేసే పనిలో ఉన్నారని తెలిసింది. ఈ చిత్రాన్ని యువీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించనున్నారు. ఆగష్టు నుంచి ఈ చిత్రాన్ని స్టార్ట్ చేయనున్నట్టు సమాచారం. అలాగే ధమకా రైటర్ బెజవాడ ప్రసన్న కుమార్ ఓ కథను చెప్పారట. ఈ కథకి కూడా చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అయితే… దీనికి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించనున్నారని సమాచారం.

అలాగే తమిళ డైరెక్టర్ మిత్రన్ కూడా ఓ కథను చెప్పారట. ఈ కథ కూడా చిరంజీవికి బాగా నచ్చడంతో ఓకే చేశారట. దీనికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా చాలా ఫాస్ట్ గా జరుగుతుందని తెలిసింది. అయితే.. చిరంజీవి కుమార్తె సుస్మిత ఓ నిర్మాణ సంస్థను స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ బ్యానర్ లో ఓ సినిమా చేయాలని చిరు ఫిక్స్ అయ్యారట. త్వరలోనే ఈ మూడు సినిమాలను ఎప్పుడు స్టార్ట్ చేయనున్నారు..? ఏ బ్యానర్ లో చేయనున్నారు అనేది ప్రకటించనున్నారు. మొత్తానికి వాల్తేరు వీరయ్య సక్సెస్ తో చిరంజీవి వరుసగా సినిమాలు చేస్తూ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తుండడం విశేషం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular