Friday, March 13, 2026
Homeస్పోర్ట్స్IPL: పంజాబ్ పై బెంగుళూరు విజయం

IPL: పంజాబ్ పై బెంగుళూరు విజయం

పంజాబ్ కింగ్స్ మరోసారి ఓటమి పాలైంది. ఈసారి సొంతగడ్డ మొహాలీ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు 24 పరుగులతో పంజాబ్ పై విజయం సాధించింది. టాస్ గెలిచిన పంజాబ్ బౌలింగ్ ఎంచుకుంది.

బెంగుళూరు ఓపెనర్లు విరాట్ కోహ్లీ- డూప్లేసిస్ లు తొలి వికెట్ కు 137 పరుగులు జోడించాడు. కోహ్లీ 47 బంతుల్లో 5  ఫోర్లు, 1 సిక్సర్ తో 59 రన్స్ చేసి ఔటయ్యాడు. ఆ తర్వాతి బంతికే గ్లెన్ మాక్స్ వెల్ డకౌట్ అయ్యాడు. 56 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 84 పరుగులు చేసి మూడో వికెట్ గా వెనుదిరిగాడు. దినేష్ కార్తీక్ (7)  విఫలం కాగా, లామ్రోర్-7; షాబాజ్ అహ్మద్-5 పరుగులతో క్రీజులో ఉన్నారు. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 174 స్కోరు చేసింది.

పంజాబ్ బౌలర్లలో హర్ ప్రీత్ బ్రార్ 2; అర్ష్ దీప్ సింగ్, నాథన్ ఎల్లీస్ చెరో వికెట్ సాధించారు.

పంజాబ్ 27 పరుగులకే మూడు వికెట్లు (అథర్వ తైడే-4; మాథ్యూ షార్ట్-8; లియామ్ లివింగ్ స్టోన్-2) కోల్పోయింది. ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగిన సిమ్రాన్ సింగ్­ 46 పరుగులతో ఆకట్టుకున్నాడు. జితేష్ శర్మ 41; హర్ ప్రీత్ భాటియా-13; హర్ ప్రీత్ బ్రార్-13; కెప్టెన్ శామ్ కర్రన్-10 పరుగులు చేశారు, 18.2 ఓవర్లలో 150 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

సిరాజ్ 4 వికెట్లతో సత్తా చాటగా, హసరంగ 2; పార్నెల్, హర్షల్ పటేల్ చెరో వికెట్ సాధించారు.

సిరాజ్ కే ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular