భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఈ నెల 22 వ తేదీన మరో వాణిజ్జ ప్రయోగానికి రంగం సిద్ధం చేసింది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ లోని మొదటి ప్రయోగ వేదికపై నుండి శనివారం మధ్యాహ్నం 2 గంటల 19 నిమిషాలకు ప్రయోగించనున్నారు. ఇస్రో PSLV -C55 రాకెట్ ద్వారా సింగపూర్ కు చెందిన టెల్ ఇయోస్ -2 ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నది. 741 కిలోల బరువు కలిగిన సింగపూర్ ఉపగ్రహం తో పాటు 16 కిలోల లుమొలైట్ అనే ఉపగ్రహాన్ని కూడా పంపటానికి సర్వం సిద్ధం చేసింది.
ఈ ప్రయోగానికి సంబందించిన కౌంట్ డౌన్ కూడా ప్రయోగానికి 25 :30 గంటల ముందు నుండి ప్రారంభించాలని శాస్త్రవేత్తలు నిర్ణయించడం జరిగింది. ఒక రాకెట్ ప్రయోగాన్ని విజయవంతం చేసి నెల రోజులు పూర్తి కాకముందే మరో రాకెట్ ప్రయోగానికి ఇస్రో సిద్దమైంది. ఈ ప్రయోగంతో మరో రికార్డును ఇస్రో సొంతం చేసుకోబోతుంది.