చార్‌ధామ్ యాత్ర మొదలైంది. అక్షయ తృతీయ సందర్భంగా శనివారం గంగోత్రి, యమునోత్రి ఆలయ ద్వారా తెరుచుకున్నాయి. మధ్యాహ్నం 12.35 గంటలకు గంగోత్రి, 12.41 గంటలకు యమునోత్రి ఆలయ ద్వారాలను తెరిచారు. మొదట గంగామాతకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సీఎం పుష్కర్ ధామి గంగోత్రి ధామ్ పోర్టల్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత యమునోత్రి ధామ్ తలుపులు తెరిచారు. చార్‌ధాయ్ యాత్ర సందర్భంగా భక్తులకు సీఎం ధామి పూలవర్షం కురిస్తూ స్వాగతం పలికారు.
Char Dham: చార్‌ధామ్ యాత్ర ప్రారంభం
యాత్ర సందర్భంగా గంగా డోలి ముఖ్‌బా గ్రామంలో శుక్రవారం ఆర్మీ బ్యాండ్ మేళాలతో గంగోత్రి ధామ్‌కు బయలుదేరింది. ఈ సందర్భంగా గ్రామస్తులు భావోద్వేగానికి గురయ్యారు. డోలీపై పూలవాన కురిపిస్తూ గంగామాతకు వీడ్కోలు పలికారు. అనంతరం పల్లకీసేవతో ముఖ్‌బా నుంచి కాలినడకన గంగోత్రి హైవే చేరుకొని.. అక్కడి నుంచి భైరో వ్యాలీకి చేరుకున్నారు. అక్కడ విశ్రాంతి తీసుకొని శనివారం ఉదయం 8 గంటలకు ధామ్‌కు బయలుదేరింది. అక్షయ తృతీయ మధ్యాహ్నం 12.13 గంటలకు భక్తుల సందర్శనార్థం గంగోత్రి ధామ్ తలుపులు తెరిచారు.