Wednesday, September 25, 2024
HomeసినిమాChiranjeevi, Shriya Saran: చిరు మూవీలో శ్రియా. ఇంతకీ.. రెమ్యూనరేషన్ ఎంత..?

Chiranjeevi, Shriya Saran: చిరు మూవీలో శ్రియా. ఇంతకీ.. రెమ్యూనరేషన్ ఎంత..?

చిరంజీవి నటిస్తున్న భారీ చిత్రం ‘భోళా శంకర్’. ఈ చిత్రానికి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో చిరంజీవికి జంటగా తమన్నా నటిస్తుంటే… చెల్లెలుగా కీర్తి సురేష్ నటిస్తుంది. ఈ క్రేజీ మూవీని అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. అభిమానులు చిరంజీవిని ఎలా చూడాలి అనుకుంటున్నారో అలా వాల్తేరు వీరయ్య చిత్రాన్ని రూపొందించారు. అందుకే ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ విషయాన్ని గుర్తించిన చిరు.. మూవీలో కూడా మార్పులు చేర్పులు చెప్పారట.  ఫ్యాన్స్ కోరుకునే పాటలు, ఫైట్స్, కామెడీ అన్నీ ఉండేలా చూసుకుంటున్నారని తెలిసింది.

ముందు అనుకున్నప్పుడు లేకపోయినా ఇప్పుడు ఓ స్పెషల్ సాంగ్ ను డిజైన్ చేశారట. ఈ స్పెషల్ సాంగ్ ను శ్రియను సంప్రదించగా, ఆమె ఓకే చెప్పినట్టు తెలిసింది.
సెకండ్ ఇన్నింగ్స్‏లోనూ తగ్గేదే లే అంటూ దూసుకెళుతుంది హీరోయిన్ శ్రియ. కథానాయికగా స్టార్ హీరోలందరి సరసన నటించింది. ఆమె ఇప్పుడు సహాయ నటిగానూ మెప్పిస్తుంది. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా.. తన వరకు వచ్చిన ప్రతి ప్రాజెక్ట్ ఒకే చెబుతుంది. ఇటీవల ఆర్ఆర్ఆర్ చిత్రంలో కీలక పాత్రలో కనిపించింది. అయితే.. హీరోయిన్‏గా కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే స్పెషల్ సాంగ్ చేసి అదుర్స్ అనిపించింది.

దేవదాసు, తులసి చిత్రాల్లో ప్రత్యేక పాటకు స్టెప్పులేశారు. ఇక ఇప్పుడు మరోసారి స్పెషల్ సాంగ్‏తో అలరించేందుకు రెడీ అయ్యింది. అయితే.. ఈ సాంగ్ కోసం శ్రియ భారీగానే డిమాండ్ చేస్తోందట. దాదాపు కోటి రూపాయాలు నిర్మాణ సంస్థను డిమాండ్ చేసిందనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తుంది. పైసా వసూల్ తర్వాత ఆమెకు సరైన విజయం లేదు. ఆర్ఆర్ఆర్ పెద్ద హిట్ అయినా.. అందులో ఆమె చేసింది చిన్న పాత్రే.  ఇటీవల కబ్జా సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈ క్రమంలోనే భోళా శంకర్ సినిమాలో స్పెషల్ సాంగ్ ఆఫర్ వచ్చిన వెంటనే..  గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్