Friday, March 29, 2024
Homeసినిమా#NBK108: బాలయ్య మూవీలో బాలీవుడ్ స్టార్..?

#NBK108: బాలయ్య మూవీలో బాలీవుడ్ స్టార్..?

బాలకృష్ణ అఖండ, వీరసింహారెడ్డి చిత్రాల తర్వాత ప్రస్తుతం 108వ చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో బాలయ్యకు జంటగా కాజల్ అగర్వాల్ నటిస్తుంటే… కూతురుగా శ్రీలీల నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన బాలయ్య ఫస్ట్ లుక్ పోస్టర్ ఈ సినిమా పై మరింత ఆసక్తిని పెంచేసింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే.. ఈ సినిమాకు సంబంధించి ఎప్పటికప్పుడు ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ బయటకు వస్తున్నాయి. దీంతో అభిమానులు ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

తాజాగా ఈ మూవీ గురించి మరో ఆసక్తికర విషయం నెట్టింట హల్ చల్ చేస్తుంది. ఇంతకీ విషయం ఏంటంటే.. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో అర్జున్ కపూర్ నటించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఆయనది చాలా కీలకమైన పాత్ర అని.. అందుకే ఆ రోల్ కోసం అర్జున్ కపూర్ ను అప్రోచ్ అయ్యారని టాక్ వినిపిస్తుంది. అయితే నిజానికి ఈ సినిమాలోని ఆ పాత్రలో తారకరత్న నటించాల్సి ఉంది కానీ.. ఆయన అకాల మరణంతో ఈ పాత్రలో ఇప్పుడు అర్జున్ కపూర్ నటిస్తుంచనున్నారట. పక్కా తెలంగాణ నేపథ్యంలో రాబోతున్న ఈ భారీ యాక్షన్ డ్రామాలో బాలయ్య చాలా ఇంటెన్స్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు.

అలాగే ఈ మూవీలో బాలయ్య కాళీమాత భక్తుడిగా నటిస్తున్నారు. అంతే కాకుండా.. ఈ సినిమాలో కాళీమాత దేవాలయంలో వచ్చే ఓ సీక్వెన్స్ కూడా చాలా బాగుంటుదని.. శ్రీలీల, బాలయ్య, కాజల్ మధ్యలో వచ్చి సీన్స్ ఆకట్టుకుంటాయని అంటున్నారు. మొత్తానికి ఈ సినిమా గురించి వస్తున్న వార్తలతో రోజు రోజుకి మరిన్ని అంచనాలు పెరుగుతున్నాయి. బాలయ్య, అనిల్ రావిపూడి కాంబోలో రాబోతున్న ఈ భారీ చిత్రానికి ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. దసరాకి ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ప్రచారంలో ఉన్నట్టుగా అర్జున్ కపూర్ కనుక ఈ సినిమాలో నటిస్తే.. మరింత క్రేజ్ రావడం ఖాయం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్