Friday, September 20, 2024
Homeస్పోర్ట్స్SL Vs. IRE: లంక ‘డబుల్’ మోత:

SL Vs. IRE: లంక ‘డబుల్’ మోత:

ఐర్లాండ్ తో జరుగుతోన్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో శ్రీలంక 3 వికెట్లతో 704 పరుగుల భారీ స్కోరు చేసింది. నిషాన్ మధుష్క-కుశాల్ మెండీస్ డబుల్ సెంచరీలతో కదం తొక్కారు. మాథ్యూస్ కూడా సెంచరీ తో అజేయంగా నిలిచాడు. నిన్న మూడో రోజు ఆట ముగిసే సమయానికి మధుష్క-149; మెండీస్ -83 పరుగులతో క్రీజులో ఉన్నారు. వీరిద్దరూ రెండో వికెట్ కు 268 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. మధుశ్క 22 ఫోర్లు, 1 సిక్సర్ తో ద్వి శతకం (205) సాధించి ఔటయ్యాడు. మెండీస్- ఆంగ్లో మాథ్యూస్ లు మూడో వికెట్ కు 133 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు, 291 బంతుల్లో 18 ఫోర్లు, 11 సిక్సర్లతో 245 పరుగులు చేసిన మెండీస్ మూడో వికెట్ గా వెనుదిరిగాడు. చండీమల్ 13 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్ తీసుకోగా, తర్వాత వచ్చన ధనుంజయ డిసిల్వా 12 (నాటౌట్) గా క్రీజులో ఉన్నాడు. మాథ్యూస్ 114 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో అజేయ సెంచరీ (100) పూర్తి చేసుకున్నాడు. ఆ వెంటనే కెప్టెన్ కరుణ రత్నే ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు. ఐర్లాండ్ బౌలర్లలో హూం, మెక్ బ్రైన్, కర్టిస్ కాంఫర్ తలా ఒక వికెట్ సాధించారు.

రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన ఐర్లాండ్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 54 పరుగులు చేసి, ఇంకా 158 పరుగులు వెనకబడి ఉంది. లంక బౌలర్లలో మెండీస్, ప్రభాత్ జయసూర్య చెరో వికెట్ పడగొట్టారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్