Tuesday, June 16, 2026
Homeస్పోర్ట్స్Badminton Asia Championships 2023: క్వార్టర్స్ కు సింధు, ప్రణయ్

Badminton Asia Championships 2023: క్వార్టర్స్ కు సింధు, ప్రణయ్

దుబాయ్ లో జరుగుతోన్న బాడ్మింటన్ ఆసియా ఛాంపియన్ షిప్స్ లో భారత షట్లర్లు పివి సింధు, హెచ్ ఎస్ ప్రణయ్ క్వార్టర్స్ లో అడుగు పెట్టారు. కాగా, కిడాంబి శ్రీకాంత్ ఓటమి పాలయ్యాడు.

మహిళల సింగిల్స్ లో పివి సింధు 21-12;21-15తో చైనా ప్లేయర్ హన్ వ్యూ పై విజయం సాధించింది.

పురుషుల సింగిల్స్ లో హెచ్ ఎస్ ప్రణయ్ 21-16; 5-21; 21-18 తేడాతో ఇండోనేషియా ప్లేయర్ చికో ఔరా ద్వి పై గెలుపొందాడు.

పురుషుల డబుల్స్ లో సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి ద్వయం 21-13;21-11తో సౌత్ కొరియా ఆటగాళ్ళు జిన్ యంగ్- నా సంగ్ సేయుంగ్ లపై గెలుపొందారు.

మిక్స్డ్ డబుల్స్ లో రోషన్ కపూర్- సిక్కీ రెడ్డి క్వార్టర్స్ లో అడుగు పెట్టారు. నేడు ప్రీ క్వార్టర్స్ ఆడాల్సిన సౌత్ కొరియా జోడీ వాకోవర్ గా వెనుదిరగడంతో వీరికి తర్వాతి రౌండ్ లో నేరుగా బెర్త్ లభించింది.

కాగా, పురుషుల సింగిల్స్ లో కిడంబి శ్రీకాంత్; మిక్స్డ్ డబుల్స్ లో సుమిత్ రెడ్డి- అశ్విని పొన్నప్ప ఓటమి చెందగా, గాయత్రి-జాలీ జోడీ వాకోవర్ గా వెనుదిరిగారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular