Friday, September 20, 2024
HomeTrending NewsManipur: మ‌ణిపూర్‌లో గిరిజనుల నిరసనలు

Manipur: మ‌ణిపూర్‌లో గిరిజనుల నిరసనలు

మ‌ణిపూర్‌లో బిజెపి ప్రభుత్వానికి గిరిజనుల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వస్తోంది. అటవీ ప్రాంతాల్లో ప్రభుత్వం చేపట్టిన సర్వే కుకి గిరిజనుల అసంతృప్తికి కారణం అయింది. తాజాగా అల్లర్లు పెరిగిపోవటంతో చూర్ చంద్ర‌పూర్ జిల్లాలో ఇంట‌ర్నెట్ సేవ‌ల్ని బంద్ చేశారు. భారీ సంఖ్య‌లో ప్ర‌జ‌లు గుమ్మికూడ‌రాదు అని ఆదేశాలు జారీ చేశారు. ఆ రాష్ట్ర సీఎం ఎన్ బీరేన్ సింగ్ ఇవాళ ఆ జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు. అయితే గురువారం రాత్రి గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు.. సీఎం బీరేన్ పాల్గొనే స‌భావేదిక‌కు నిప్పుపెట్టారు. దీంతో ఆ వేదిక పూర్తిగా మంట‌ల్లో ద‌గ్ధ‌మైంది. రిజ‌ర్డ్వ్ ఫారెస్టులో బీజేపీ స‌ర్కార్ చేస్తున్న స‌ర్వేల‌పై స్థానికుల్లో వ్య‌తిరేక‌త వ‌స్తున్న‌ది. గిరిజ‌న సంఘాలు భారీ ఆందోళ‌న చేప‌ట్టాయి. ఎటువంటి సంప్ర‌దింపులు జ‌ర‌ప‌కుండానే చ‌ర్చిల‌ను కూల్చివేస్తున్నార‌ని, ప‌విత్ర‌మైన చ‌ర్చిల ప‌ట్ల అగౌర‌వంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని గిరిజ‌న నేత‌లు ఆరోపిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్