వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న గుజరాత్ టైటాన్స్ కు ఢిల్లీ క్యాపిటల్స్ షాక్ ఇచ్చింది. నేటి మ్యాచ్ లో ఐదు పరుగులతో ఢిల్లీ విజయం సాధించింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో ఢిల్లీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. జట్టులో అమన్ హకీమ్ ఖాన్ 51; అక్షర పటేల్ 27; రిఫల్ పటేల్ 23 పరుగులు చేశారు. మిగిలిన బ్యాతస్ మెన్ విఫలమయ్యారు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్లలో మహమ్మద్ షమీ నాలుగు; మోహిత్ శర్మ రెండు; రషీద్ ఖాన్ ఒక వికెట్ పడగొట్టారు.
స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ కు పరుగుల ఖాతా ప్రారంభించక ముందే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్ వృద్ధిమాన్ సాహా ఔటయ్యాడు. 32 పరుగులకే నాలుగు కీలక వికెట్లు (శుభ్ మన్ గిల్-6; విజయ్ శంకర్-6;డే విడ్ మిల్లర్ డకౌట్) కోల్పోయింది. ఈ దశలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా బాధ్యతాయుతంగా ఆడి 53 బంతుల్లో ఏడు ఫోర్లతో అజేయంగా నిలిచాడు. అభినవ్ మనోహర్ 26; రాహుల్ తెవాటియా 20… మాత్రమే రెండంకెల స్కోర్ దాటగలిగారు. 19 ఓవర్లో రాహుల్ తేవాటియా మూడు వరుస సిక్స్ లతో జట్టును విజయతీరాలకు తీసుకెళ్ళాడు. గుజరాత్ విజయానికి చివరి ఓవర్ లో 12 పరుగులు అవసరమైన దశలో ఢిల్లీ బౌలర్ ఇషాంత్ శర్మ చక్కని బంతులు వేసి నాలుగో బంతికి రాహుల్ ను ఔట్ చేయడంతో మ్యాచ్ ఢిల్లీ వైపు మొగ్గింది, 20 ఓవర్లలో ఆరు వికెట్ల కోల్పోయి 125 పరుగులు మాత్రమే గుజరాత్ చేయగలిగింది. ఢిల్లీ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, ఇషాంత్ శర్మ చెరో 2; కుల్దీప్ యాదవ్, నార్త్జ్ చెరో వికెట్ సాధించారు.
షమీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.