Friday, November 22, 2024
Homeస్పోర్ట్స్మీరాబాయికి ఘన స్వాగతం

మీరాబాయికి ఘన స్వాగతం

టోక్యో 2020 ఒలింపిక్స్ లో 49 కిలోల వెయిట్ లిఫ్టింగ్ లో రజత పతక విజేత మీరాబాయి చాను కు కేంద్ర ప్రభుత్వం ఘనంగా స్వగతం పలికింది. పలువురు కేంద్ర మంత్రులు ఆమెకు స్వయంగా అభినందనలు తెలిపారు. ఈశాన్య ప్రాంత అభివృద్ధి, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి .కిషన్ రెడ్డి మీరాబాయి ని ప్రత్యేకంగా అభినందించారు.

“ఒలింపిక్స్ క్రీడల వెయిట్ లిఫ్టింగ్‌ విభాగంలో రజత పతకం సాధించిన.. పద్మశ్రీ సైఖోమ్ మీరాబాయి చానుకు నా హృదయపూర్వక అభినందనలు. భరతమాత గర్వించేలా మన దేశ  కుమార్తెలు పతకాలు గెలుచుకోవడం పట్ల నా హృదయం గర్వంతో ఉప్పొంగుతోన్నది . ఒలింపిక్  పోడియంపై  మెడలో వెండి పతకంతో మీరాబాయి ప్రతి భారతీయ హృదయాన్నీ గెలుచుకుంది” అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

“దృఢసంకల్పం, నిరంతర కృషి , సవాళ్ళను అధిగమించాలనే తపన మనం కన్న కలలను సాధించడానికి ఏకైక మార్గం అని… మీరాబాయి మరొకసారి నిరూపించారు. ఆమె సాధించిన విజయం క్రిడా ప్రపంచానికే కాకుండా…  లక్ష్యం దిశగా శ్రమించే ప్రతి ఒక్కరికి ప్రేరణగా నిలుస్తుంది”

“దేశానికి గర్వించదగ్గ పురస్కారాలను అందించటంలో.. ఈశాన్య రాష్ట్ర యువత క్రీడల పట్ల చూపిస్తున్న ఉత్సాహం, వారి చురుకైన క్రీడా సంస్కృతి, దోహద పడుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది”.

“మీరాబాయి సుదీర్ఘ ప్రయాణానికి ఈ విజయం తొలిమెట్టు అలాగే మున్ముందు ఆమె సాదించబోయే విజయాలను చూసి మనందరం గర్వించే క్షణాలకు నాంది. ఈ అద్భుతమైన ప్రయాణంలో ఆమెకు తోటి భారతీయులందరి మద్దతు  ఉంటుందని విశ్వసిస్తున్నాను’ అని కిషన్ రెడ్డి తన సందేశంలో వెల్లడించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్