సొంతగడ్డపై సన్ రైజర్స్ హైదరాబాద్ కు మరోసారి పరాభవం ఎదురైంది. నేడు జరిగిన మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ ఐదు పరుగులు తేడాతో హైదరాబాద్ పై విజయ సాధించింది. ఉప్పల్ లో జరిగిన ఈ మ్యాచ్ లో కోల్ కతా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. రింకూ సింగ్ -46; కెప్టెన్ నితీష్ రాణా-42, ఆండ్రీ రస్సెల్ రసూల్ 24, జేసన్ రాయ్-20 పరుగులతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల కోల్పోయి 171 పరుగులు చేసింది.
హైదరాబాద్ బౌలర్లలో మార్కో జేన్సన్, నటరాజన్ చెరో రెండు; భువనేశ్వర్, కార్తీక్ త్యాగి, మార్కండే, మార్ క్రమ్ తలా ఒక వికెట్ పడగొట్టారు.
హైదరాబాద్ 54 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. మయాంక్ అగర్వాల్-18, రాహుల్ త్రిపాఠి-20 రన్స్ చేయగా… అభిషేక్ శర్మ-9, హ్యారీ బ్రూక్ (డకౌట్) విఫలమయ్యారు. కెప్టెన్ ఏడెన్ మార్ క్రమ్- 41, హెన్రిచ్ – 36 పరుగులతో రాణించారు, చివర్లో అబ్దుల్ సమద్ 21 పరుగులు చేసి గెలుపుపై ఆశలు రేకెత్తించినా చివరి ఓవర్లో 9 పరుగులు కవాల్సిన దశలో మూడో బంతికి సమద్ ఔట్ కావడంతో హైదరాబాద్ కు నిరాశ తప్పలేదు. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 166 పరుగులే చేయగలిగింది.
కోల్ కతా బౌలర్లలో వైభవ్ అరోరా, శార్దూల్ ఠాకూర్ చెరో రెండు; హర్షిత్ రాణా, ఆండ్రీ రస్సెల్, అనుకూల్ రాయ్, వరుణ్ చక్రవర్తి తలా ఒక వికెట్ సాధించారు. కట్టుదిట్టంగా బౌలింగ్ వరుణ్ చక్రవర్తికి ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ లభించింది