ఐపీఎల్ లో నేడు జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ పై విజయం సాధించింది. 13 ఏళ్ల తర్వాత సొంత స్టేడియం చెన్నై చెపాక్ లో ముంబై ను ఓడించింది. టాస్ గెలిచిన చెన్నై బౌలింగ్ ఎంచుకుంది.
ముంబై 14 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కామెరూన్ గ్రీన్-6, ఇషాన్ కిషన్-7 రన్స్ చేయగా రోహిత్ శర్మ డకౌట్ అయ్యాడు. సూర్య కుమార్ యాదవ్ 26 పరుగులు చేసి జట్టు స్కోరు 69 వద్ద వెనుదిరిగాడు. ఈ దశలో నేహాల్ వధేరా – స్టబ్స్ లు ఐదో వికెట్ కు 54 పరుగులు జోడించారు. వధేరా 51 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్సర్ తో 64; స్టబ్స్ 20 పరుగులు సాధించారు. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో మతీషా పథిరణ మూడు; దీపక్ చాహర్, తుషార్ దేశ్ పాండే చెరో రెండు; జడేజా ఒక వికెట్ సాధించారు.
చెన్నై బ్యాట్స్ మెన్ డెవాన్ కాన్వె-44; రుతురాజ్ గైక్వాడ్ -30; అజింక్యా రెహానే-21; శివం దూబే-26 పరుగులు చేసి చెన్నై జయంలో తమ వంతు పాత్ర పోషించారు, 140 పరుగుల విజయ లక్ష్యాన్ని 17.5 ఓవర్లలో నాలుగు వికెట్ల కోల్పోయి సాధించింది.
మతీషా పథిరణకు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ లభించింది.