Thursday, June 18, 2026
Homeసినిమాసీక్రెట్స్ బయటపెట్టిన చైతన్య

సీక్రెట్స్ బయటపెట్టిన చైతన్య

అక్కినేని నాగచైతన్య నటించిన లేటెస్ట్ మూవీ ‘కస్టడీ’. ఈ చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకత్వం వహించారు. ఈ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీని తెలుగు, తమిళ్ లో రిలీజ్ చేస్తున్నారు. టీజర్ అండ్ ట్రైలర్ ఇంట్రస్టింగ్ గా ఉండడంతో సినిమా పై అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. మే 12న కస్టడీ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓ వైపు తమిళ్, మరో వైపు తెలుగు రెండింటిలోనూ జోరుగా ప్రమోషన్స్ చేస్తుండడం విశేషం. ‘కస్టడీ 2’ కూడా ఉంటుందని డైరెక్టర్ వెంకట్ ప్రభు హింట్ ఇవ్వడంతో మరింత ఆతృతగా కస్టడీ కోసం ఎదురు చూస్తున్నారు.

అయితే.. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్ వ్యూలో నాగచైతన్య పలు ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు. ఇంతకీ ఏం చెప్పాడంటే.. తన ఫస్ట్ కిస్, ఫస్ట్ డేట్ గురించి ఓపెన్ గా చెప్పడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తాను ఆరు లేదా ఏడో తరగతిలో ఉన్నప్పుడు మొదటిసారి ఓ అమ్మాయిని ఇష్టపడ్డానని.. ఇంటర్ లో ఉన్నప్పుడు ఫస్ట్ డేట్ కోసం కాఫీ షాపుకు వెళ్లానని చెప్పాడు. అలాగే ఆన్ స్క్రీన్ ఫస్ట్ కిస్ ‘ఏ మాయ చేసావే’ సినిమాలో జరిగిందని.. ఆఫ్ స్క్రీన్ ఫస్ట్ కిస్ ఎప్పుడ జరిగిందనేది చెప్పాలనుకోవడం లేదని.. అమ్మాయిలో తాను ఫస్ట్ గమనించేది.. నచ్చేది… కేవలం తన వ్యక్తిత్వం మాత్రమే అని అన్నారు.

అంతే కాకుండా.. తనకు ఒంటరితనం అంటే ఇష్టమని చెప్పాడు. ఎక్కువగా ఒంటరిగా ఉంటుంటాను. అలా ఉండడానికి ఇష్టపడతాను. ఒంటరిగా ఉన్నప్పుడే మన గురించి మనకు మరిన్ని విషయాలు తెలుస్తాయి. కొత్త ఆలోచనలు వస్తాయి. జీవితం మరింత బ్యాలెన్స్ గా ఉండేందుకు అవి తోడ్పడుతాయి అంటూ తన మనసులో ఫీలింగ్స్, కొన్ని సీక్రెట్స్ ను బయటపెట్టారు నాగచైతన్య. సినిమాల విషయానికి వస్తే.. కస్టడీ తర్వాత శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. త్వరలోనే ఈ సినిమాని ప్రకటించనున్నాడు. అలాగే చందు మొండేటితో కూడా చైతన్య ఓ సినిమా చేయనున్నాడని సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular