Thursday, June 18, 2026
Homeసినిమాఅఖండ 2 సెట్స్ పైకి వచ్చేది ఎప్పుడు..?

అఖండ 2 సెట్స్ పైకి వచ్చేది ఎప్పుడు..?

బాలకృష్ణ, బోయపాటి శ్రీను కలయికలో వచ్చిన సింహా, లెజెండ్, అఖండ చిత్రాలు రావడం.. ఈ మూడు చిత్రాలు బ్లాక్ బస్టర్స్ అవ్వడం తెలిసిందే. అఖండ సినిమా అయితే.. అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని బాలయ్య కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా నిలిచింది. ఈ మూవీ చివరిలో ‘అఖండ 2’ ఉంటుందని హింట్ ఇచ్చారు. ఆమధ్య బోయపాటి కూడా ఉంటుందని అనౌన్స్ చేయడంతో బాలయ్య అభిమానులు ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు.

ప్రస్తుతం బాలయ్య అనిల్ రావిపూడితో సినిమా చేస్తున్నారు. ఈ చిత్రాన్ని దసరాకి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే.. అనిల్ రావిపూడితో సినిమా తర్వాత బాలయ్య ఎవరితో సినిమా చేయనున్నాడు అనేది ప్రకటించలేదు కానీ.. బోయపాటితో సినిమా చేయనున్నాడని వార్తలు వస్తున్నాయి. అయితే.. 2024 ఎన్నికలకు ఉపయోగపడేలా బాలయ్యతో బోయపాటి సినిమా చేస్తే.. బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు. బోయపాటి కూడా అలాంటి పొలిటికల్ స్టోరీ రెడీ చేశాడట. ఈ స్టోరీలో పవర్ ఫుల్ పొలిటికల్ డైలాగ్స్ ఉంటాయని సమాచారం.

అయితే.. బాలయ్య మాత్రం అఖండ 2 చేయాలి అనుకుంటున్నాడట. అఖండ సినిమాలో మాస్ అంశాలతో పాటు ఎలివేషన్లు పుష్కలంగా ఉన్నాయి. వీటితో పాటు హిందూ ధర్మం దాన్ని కాపాడాల్సిన అవశ్యకత గురించి అంతర్లీనంగా చెప్పడం జరిగింది. అది జనాలకు బాగా నచ్చింది. అలాగే ప్రస్తుతం దేశమంతట రూపొందుతున్న చిత్రాల్లో హిందుత్వం అనేది సెల్లింగ్ పాయింట్ గా మారింది. కథలో హిందుత్వం గురించి బలంగా చెబితే బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురుస్తుంది అనడంలో సందేహం లేదు. అందుచేత అఖండ 2నే చేస్తారని టాక్ వినిపిస్తుంది. మరి.. బాలయ్య బోయపాటితో పొలిటికల్ మూవీ చేస్తారా..? అఖండ 2 చేస్తారా..? క్లారిటీ రావాలంటే.. బాలయ్య పుట్టినరోజు జూన్ 10 వరకు ఆగాల్సిందే. ఎందుకంటే.. ఆ రోజున బోయపాటితో మూవీని అనౌన్స్ చేస్తారని తెలిసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular