ప్రభాస్ నటించిన చిత్రం ‘ఆదిపురుష్’. ఈ చిత్రానికి ఓంరౌత్ దర్శకత్వం వహించారు. రామాయణం ఆధారంగా మూవీ చేస్తున్నారని ప్రకటించినప్పటి నుంచి ఈ సినిమా పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఆమధ్య రిలీజ్ చేసిన టీజర్ కు డివైడ్ టాక్ రావడంతో మరింత శ్రద్ధగా ఈ సినిమాని రూపొందిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పై మళ్లీ వర్క్ చేయడంతో అదనంగా 100 కోట్లు బడ్జెట్ పెరిగిందని టాక్. ఇక ఈ మూవీని జూన్ 16న భారీ స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ట్రైలర్ విషయానికి వస్తే.. ఇది నా రాముడి కథ అంటూ వాయిస్`ఓవర్‌తో మొదలుపెట్టారు. ‘ఆయన మనిషిగా పుట్టిన భగవంతుడు అయిన మహనీయుడు. ఆయన జీవితం ధర్మానికి, సన్మార్గానికి నిదర్శనం. ఆయన నామం రామనామం.. ఆయన ధర్మం.. అధర్మానికి ఉన్న అహంకారాన్ని అంతం చేసింది. ఇది ఆ రఘనందుడి ఘనత. యుగయుగాల్లోనూ సజీవం. జాగృతం. మా రాఘవుడి కథే రామయణం..’ అంటూ ట్రైలర్‌ను పరిచయం చేశారు.
టీజర్‌పై తీవ్ర విమర్శలు వచ్చిన నేపథ్యంలో ట్రైలర్ విషయంలో మేకర్స్ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించేలా డైలాగ్స్ ఉన్నాయి. విజవల్ వండర్‌లా అదిరిపోయే గ్రాఫిక్స్‌తో డిజైన్ చేశారు. అయితే త్రీడీలో చూస్తే మరింత ఎఫెక్టివ్‌గా అనిపిస్తుంది. త్రీడీలో ఈ ట్రైలర్ అంతకు మించి అనేలా ఉంది. విజువల్ వండర్‌గా తీర్చి దిద్దినట్టు అనిపిస్తుంది. మునుపటి కంటే వీఎఫ్ఎక్స్ బాగున్నాయి.
అయితే ప్రభాస్ కాస్త లావుగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. సీతగా కృతి సనన్ అదరగొట్టేస్తుంది. లక్ష్మణుడు, ఆంజనేయుడి పాత్రలు ఈ ట్రైలర్‌లో బాగున్నాయి. రావణుడిగా సైఫ్ అలీ ఖాన్‌ను రెండు మూడు షాట్లకే పరిమితం చేశారు. ఇక ఈ ట్రైలర్‌తో ఆదిపురుష్ మీద అంచనాలు పెరగడం మాత్రం ఖాయం. ఇక ఈ ట్రైలర్‌లో బీజీఎం, జై శ్రీరామ్ నామమంత్రం హైలెట్ అవుతోంది.