Saturday, March 2, 2024
HomeTrending NewsCM Jagan: అందరం సేవకులమే :సిఎం జగన్

CM Jagan: అందరం సేవకులమే :సిఎం జగన్

ప్రభుత్వ సేవలకు సంబంధించి వ్యక్తిగత సమస్యలకు మరింత మెరుగైన పరిష్కారం చూపేలా తపన, తాపత్రయంతో పుట్టకొచ్చిన మెరుగైన ఆలోచనతోనే  ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమాన్ని తీసుకువచ్చామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. అర్హత ఉన్నా.. రాని పరిస్థితులు ఉన్నా;  న్యాయం మీ వైపున ఉన్నా.. జరగని పరిస్థితులు ఉన్నా; ఇంతకుముందు ప్రయత్నం చేసినా.. మీ ప్రయత్నం సత్ఫలితం ఇవ్వని పరిస్థితుల్లో ఈ కార్యక్రమం ద్వారా లబ్దిదారుడికి న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు.

‘జగనన్నకు చెబుదాం’  కార్యక్రమాన్ని సిఎం క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌ పద్ధతిలో సిఎం జగన్ ప్రారంభించారు. కలెక్టర్లు, ప్రభుత్వాధికారులు వీడియో కాన్ఫరెన్స్‌ద్వారా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సిఎం  చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు:

 • జగనన్నకు చెబుదాం కార్యక్రమం మిగతా కార్యక్రమాలకంటే భిన్నమైనది
 • ప్రతి సమస్యలకూ పరిష్కారం చూపాలని నాలుగు సంవత్సరాలుగా మన పరిపాలన సాగింది
 • 3648 కి.మీ సాగిన నా పాదయాత్రలో ప్రతి గ్రామంలో, ప్రతి జిల్లాల్లో… నాకు కనిపించిన సమస్యలకు పరిష్కారం వెతికే క్రమంలో అడుగులు వేస్తూ ఈ నాలుగేళ్లుగా ముందుకు సాగాం
 • చాలావరకు సమస్యలు అన్నీ కూడా మానవ తప్పిదాలే
 • ప్రభుత్వం పలకాల్సిన పరిస్థితుల్లో పలికితే, ప్రభుత్వం న్యాయంగా, ధర్మంగా ఉంటే… ఎలాంటి సమస్యలైనా పరిష్కారమవుతాయని పాదయాత్రలో  అనిపించింది
 • ఒక పద్ధతిలో ప్రభుత్వం లేకపోతే 90 నుంచి 95శాతం సమస్యలు వస్తాయి
 • పింఛన్లు రాలేదని పాదయాత్రలో నా దగ్గరకు వచ్చేవారు
 • జన్మభూమి కమిటీలు చెప్తేకాని.. ఇవ్వని పరిస్థితి ఆనాటిది
 • మీరు ఏ పార్టీకి సంబంధించన వారని అడిగేవారు
 • అంతేకాక ప్రతి పనికీ కూడా నాకెంత ఇస్తావు అని అడిగే గుణం
 • పెన్షన్ల దగ్గర నుంచి చూస్తే.. ఇళ్లకేటాయింపులు వరకూ ఇదే పరిస్థితి
 • ఏ ప్రభుత్వ పథకం తీసుకున్నా.. ప్రతి అడుగులోనూ వివక్ష, లంచాలు కనిపించేవి
 • మేం ఇవ్వగలిగింది ఇంతే.. ఊర్లో ఇంతమందికే ఇస్తామని చెప్పేవారు
 • ఎవరైనా సరే తప్పుకుంటేనే, చనిపోతేనే మిగతావాళ్లకి వచ్చే పరిస్థితి, సుదీర్ఘ పాదయాత్రలో ఇవన్నీ చూశాం
 • అర్హత ఉన్నవాళ్లు ఎంతమంది ఉంటే.. అంతమందికి ఇవ్వడం, తన పార్టీ, వేరే పార్టీని చూడకుండా ఇవ్వడం, వివక్ష లేకుండా ఇవ్వడం, లంచాలు లేకుండా ఇవ్వడం, సంతృప్తి స్థాయిలో ఇవ్వడం, గ్రామస్థాయిలో ఇవ్వగలిగితే.. అన్ని పరిష్కారాలూ దొరుకుతాయని పరిపాలనలో మార్పులు తీసుకు వచ్చాం
 • అర్హత ఉన్న ప్రభుత్వ సేవలు అందకపోయినా, పథకాలు అందకపోయినా, ఆరోగ్యశ్రీ, పెన్షన్‌ కానుక, భూమి రికార్డులు… ఇలా ఎలాంటి సేవ అయినా.. మన ప్రయత్నంచేసినప్పటికీ కూడా మనకు ఫలితాలు రాని పక్షంలో నేరుగా మీ జగన్‌కు, మీ అన్నకే, మీ తమ్ముడికే, మీ ఇంట్లో మీ బిడ్డకే ఫోన్‌ కొట్టండి
 •  1902కు ఫోన్‌ కొడితే… నేరుగా సీఎంఓకే ఫోన్‌ వస్తుంది
 • పరిష్కారం ఈ స్థాయిలో చూపించే గొప్ప ఆలోచనకు అడుగులు వేస్తున్నాం
 • మీరు ప్రయత్నంచేసినా పరిష్కారం కాని సమస్యలు నేరుగా నా దృష్టికే వస్తాయి
 • కాల్‌చేశాక మీకు ఒక వైయస్సార్‌ రిఫరెన్స్‌ ఐడీ నంబర్‌ వస్తుంది
 • మీ ఫిర్యాదుకు అంత గౌరవం ఇస్తూ వైయస్సార్‌ పేరు పెట్టాం
 • మీ సమస్యను నా సమస్యగా భావించి.. దాన్ని ట్రాక్‌ చేస్తాం
 • నేరుగా సీఎంఓనే దీన్ని ట్రాక్‌ చేస్తుంది
 • ప్రతి అడుగులోకూడా ఎస్‌ఎంఎస్‌ద్వారా, ఐవీఆర్‌ఎస్‌ద్వారా మీ ఫిర్యాదు పరిష్కారంపై ఎప్పటికప్పుడు మెసేజ్‌లు, సందేశాలు వస్తాయి, లేదా నేరుగా కూడా చూడవచ్చు
 • మండలాలు, జిల్లాలు, రాష్ట్ర సచివాలయాల్లో, సీఎంఓలో ప్రాజెక్ట్‌ మానిటరింగ్‌ యూనిట్లు పెట్టాం
 • సీఎంఓ, సీఎస్‌, డీజేపీ.. ముగ్గురుకూడా సమీక్షలు చేసి.. ఈ కార్యక్రమాన్ని ముందుకు బలంగా నడుపుతారు
 • ప్రాజెక్ట్‌ మానిటరింగ్‌ యూనిట్లలో ప్రతి చోటా కూడా మీ సమస్య పరిష్కారాన్ని మానిటరింగ్‌ చేస్తారు. సొల్యూషన్‌ ఇచ్చేలా అడుగులు ముందుకు వేస్తారు
 • సమస్య పరిష్కారం అయ్యాక… మీకు ఫోన్‌చేసి.. మీ ఫీడ్‌బ్యాక్‌ తీసుకుంటారు
 • జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో ఇవన్నీకూడా జరుగుతాయి
 • వీటన్నింటి ద్వారా ప్రజలకు ఇంకా మంచి జరగాలని మనసారా కోరుకుంటున్నాను
 • ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న నా దగ్గరనుంచి మొదలుపెడితే… అంతా ప్రజలకు సేవలకు అందించడానికే ఉన్నాం
 • కేవలం అధికారాన్ని చెలాయించడానికి కాదు
  సచివాలయంలోని అధికారి నుంచి వాలంటీర్‌ వరకూ కూడా ప్రజలకు సేవకులమే
 • ప్రజల ముఖంలో చిరునువ్వులకోసమే
 • ఈ ప్రభుత్వం మీ అందరి ప్రభుత్వం
 • భాగస్వాములైన అధికారులందరినీ కోరేది ఒక్కటే.. అంతా కలిసికట్టుగా ఒక్కటై ప్రతి ముఖంలో కూడా చిరునవ్వులు చూడాలి
 • ప్రభుత్వ ప్రతిష్టను ఇంకా పెంచేలా, సమర్థతను మరింత పెంచడానికి ఇది ఉపయోగపడుతుంది
 • జిల్లాలకు సీనియర్‌ అధికారులను స్పెషల్‌ ఆఫీసర్లుగా నియమించాం, క్రమం తప్పకుండా వీరు జిల్లాలకు వస్తారు
 • జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసేలా చూస్తారు

RELATED ARTICLES

Most Popular

న్యూస్