Saturday, November 23, 2024
Homeస్పోర్ట్స్IPL: సూర్య సునామీ - బెంగుళూరుకు భంగపాటు

IPL: సూర్య సునామీ – బెంగుళూరుకు భంగపాటు

కీలక సమయంలో ముంబై స్టార్ సూర్య కుమార్ యాదవ బ్యాట్ ఝలిపించడంతో  బెంగుళూరు ఇచ్చిన 200 పరుగులు విజయ లక్ష్యాన్ని మరో 21 బంతులు మిగిలి ఉండగానే ఛేదించి ముంబై ఘన విజయం సాధించింది.  సూర్య 35 బంతుల్లో  7 ఫోర్లు, 6 సిక్సర్లతో 83 పరుగులతో విధ్వంసం సృష్టించగా, ఓపెనర్ ఇషాన్ కిషన్ 21 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 42;  నేహాల్ వధేరా  34 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో  52 (నాటౌట్ ) రన్స్ తో బెంగుళూరు బౌలింగ్ ను కాకా వికలం చేశారు. కెప్టెన్ రోహిత్ శర్మ (7) మరోసారి విఫలమయ్యాడు. కామెరూన్ గ్రీన్ 2 పరుగులతో క్రీజులో నిలిచాడు, 16.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది.  బెంగుళూరు బౌలర్లలో వానిందు హసరంగ, విజయ్ కుమార్ వ్యాసాక్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

వాంఖేడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ముంబై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. బెంగుళూరు 16 పరుగులకే రెండు వికెట్లు (విరాట్ కోహ్లీ-1; అర్జున్ రావత్-6) కోల్పోయి కష్టాల్లో పడింది. కెప్టెన్ డూప్లెసిస్- గ్లెన్ మాక్స్ వెల్ లు మూడో వికెట్ కు 120 పరుగులు జోడించారు. 33 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 68 పరుగులు చేసిన మాక్స్ వెల్ వెనుదిరిగిన అనంతరం క్రీజులోకి వచ్చిన  లామ్రోర్ (1) విఫలమై వెంటనే పెవిలియన్ చేరాడు. డూప్లెసిస్ 41బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 65 పరుగులు చేసి నాలుగో వికెట్ గా వెనుదిరిగాడు. దినేష్ కార్తిక్-30 రన్స్ చేసి ఔట్ కాగా, కేదార్ జాదవ్, వానిందు హసరంగ చెరో 12 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి  199 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో బెహ్రెన్డార్ఫ్ 3; కామెరూన్ గ్రీన్, క్రిస్ జోర్డాన్, కుమార్ కార్తికేయ తలా ఒక వికెట్ సాధించారు.

సూర్య కుమార్ యాదవ్ కే ‘ ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్