Sunday, September 8, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్ఛైర్మన్ ఆదేశాలు పాటించాల్సిందే

ఛైర్మన్ ఆదేశాలు పాటించాల్సిందే

మన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ అశోక్ గజపతిరాజు ఇచ్చిన ఆదేశాలను కార్యనిర్వహణాధికారి (ఈవో) పాటించాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసింది. ట్రస్టు ఈవో తన మాట వినడం లేదని, కోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించడం లేదని పేర్కొంటూ అశోక్ గజపతి కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం ఛైర్మన్ అధికారాలను ఎవరూ అడ్డుకోలేరని, ట్రస్టు అధిపతిగా అయన ఇచ్చిన ఆదేశాలను ఉల్లఘించడం ఈవోకు సరికాదని వెల్లడించింది.

గత ఏడాది మన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ గా అశోక్ గజపతి స్థానంలో అయన సోదరులు ఆనంద గజపతి రాజు కుమార్తె సంచయిత గజపతి రాజును ఏపీ ప్రభుత్వం నియమించింది. దీనిపై హైకోర్టును ఆశ్రయించారు అశోక్ గజపతి. విచారణ అనంతరం ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు తప్పుబట్టింది. సంచయితను నియమిస్తూ ఇచ్చిన జీవో ను కొట్టివేసింది. దీంతో అశోక్ గజపతి మళ్ళీ ట్రస్ట్  ఛైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు. అయితే ఆయన్ను ఈవో ఒక్కసారి కూడా కలుసుకోలేదు, ట్రస్టు తరఫున నిర్వహించే విద్యాసంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు జీతాలు వెంటనే చెల్లించాలని ఇచ్చిన ఆదేశాలను కూడా ఈవో పాటించలేదు. ఉద్యోగులు ఆందోళన కూడా చేశారు.  దీనిపై అశోక్ గజపతి ఈవో పై ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారించిన కోర్టు నేడు తీర్పు వెలువరించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్