Friday, September 20, 2024
Homeస్పోర్ట్స్IPL: Yashasvi Jaiswal: జైస్వాల్ విధ్వంసం- రాజస్థాన్ కు భారీ విజయం

IPL: Yashasvi Jaiswal: జైస్వాల్ విధ్వంసం- రాజస్థాన్ కు భారీ విజయం

రాజస్థాన్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ శివాలెత్తాడు. కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన నేటి మ్యాచ్ లో ఫోర్లు, సిక్సర్లతో విధ్వంసం సృష్టించాడు. దీనితో కోల్ కతా ఇచ్చిన 150 పరుగుల విజయ లక్ష్యాన్ని కేవలం ఒక వికెట్ కోల్పోయి 13.1 ఓవర్లలోనే రాజస్థాన్ ఛేదించింది. కోల్ కతా కెప్టెన్ నితీష్ రానా వేసిన తొలి ఓవర్లోనే జైస్వాల్  రెండు సిక్సర్లు, మూడు ఫోర్లతో 26 పరుగులు రాబట్టాడు. ఐపీఎల్ చరిత్రలో అతి తక్కువ బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. 13 బంతుల్లో 3 సిక్సర్లు, 7 ఫోర్లతో ఈ ఫీట్ సాధించాడు.

జైస్వాల్ 47 బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్సర్లతో98; కెప్టెన్ సంజూ శామ్సన్ 29 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 48 పరుగులతో అజేయంగా నిలిచి 9 వికెట్లతో ఘనవిజయం అందించారు. ఇన్నింగ్స్ రెండో ఓవర్లో జోస్ బట్లర్ (డకౌట్) రనౌట్ గా వెనుదిరిగాడు.

కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన ఈ మ్యాచ్ లో రాజస్థాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. వెంకటేష్ అయ్యర్ – 57 (42 బంతులు, 2 ఫోర్లు, 4 సిక్సర్లు) ఒక్కడే రాణించాడు. నితీష్ రాణా-22; రహమతుల్లా గుర్జాబ్-18; రింకూ సింగ్-16 ఫర్వాలేదనిపించారు. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది.  రాజస్థాన్ బౌలర్లలో యజువేంద్ర చాహల్ 4; ట్రెంట్ బౌల్ట్ 2; సందీప్ శర్మ, ఆసిఫ్ చెరో వికెట్ సాధించారు.

యశస్వి జైస్వాల్ కే ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ లభించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్