మోచ తుఫాన్ ఇప్పుడు అతి తీవ్ర తుఫాన్‌గా మారింది. బంగాళాఖాతం తీర ప్రాంతంపై తుఫాన్ ప్రభావం ఉండనున్నది. బెంగాల్‌లో 200 మంది రెస్క్యూ సిబ్బందితో పాటు ఎన్డీఆర్ఎఫ్ దళాలు అప్రమత్తంగా ఉన్నాయి. స్టాండ్‌బైలో మరో 100 మంది రెస్క్యూ దళం ఉన్నట్లు ఎన్డీఆర్ఎప్ సెకండ్ బెటాలియన్ కమాండెంట్ గుర్మిందర్ సింగ్ తెలిపారు. బెంగాల్ తీర ప్రాంతంలో ఇండియన్ కోస్టు గార్డు దళం కూడా హై అలర్ట్‌లో ఉంది.
బంగ్లాదేశ్, మయన్మార్ బోర్డర్ వద్ద ఆ తుఫాన్ తీరం దాటే అవకాశాలు ఉన్నాయి. ఆ ప్రాంతంలో గంటకు సుమారు 160 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయి. బంగ్లాదేశ్ కోక్స్ బజార్ ప్రాంతంలో రెండు మీటర్ల మేర వర్షం పడే ఛాన్సు ఉందని ఐఎండీ చెప్పింది. బంగాళాఖాతంలో ఈశాన్యం దిశగా వెళ్లకూడదని జాలర్లకు వెదర్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈశాన్య రాష్ట్రాల్లో కూడా అలర్ట్ జారీ చేశారు. అండమాన్ నికోబార్ దీవుల్లోనూ అలర్ట్ ప్రకటించారు. త్రిపుర, మీజోరంలో భారీ స్థాయిలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. నాగాలాండ్, మణిపూర్, సౌత్ అస్సాంలో స్వల్ప స్థాయిలో వర్షం కురవనున్నది.
ఈసారి తుఫాన్‌కు మోచ అనే పేరును యెమెన్ దేశం సూచించింది. ఆ దేశంలో మోచ ఓ చిన్న గ్రామం. అక్కడ ఫిషింగ్ ఎక్కువగా జరుగుతుంది. కాఫీ ఉత్పత్తిలోనూ ఆ ఊరుకు ప్రత్యేక పేరుంది.
Post Views: 58