ప్రభాస్, ఓంరౌత్ కాంబినేషన్లో రూపొందిన చిత్రం ఆదిపురుష్. రామాయణం ఆధారంగా రూపొందిన ఈ మూవీలో రాముడుగా ప్రభాస్; సీతగా కృతి సనన్; రావణుడుగా సైఫ్ ఆలీఖాన్ నటించారు. అయితే.. ఈ మూవీ టీజర్ కు మిశ్రమ స్పందన వచ్చింది. ఇంకా చెప్పాలంటే నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. దీంతో మళ్లీ గ్రాఫిక్స్ లో మార్పులు చేర్పులు చేశారు మేకర్స్. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేశారు. ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన ఆదిపురుష్ ట్రైలర్ కి మాత్రం ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.
దీంతో ఆదిపురుష్ మూవీ పై అందరిలో ఆసక్తి ఏర్పడింది. జూన్ 16న ఆదిపురుష్ మూవీని ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల చేయనున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ లో స్పీడు పెంచుతున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భద్రాచలం, తిరుపతిలో చాలా గ్రాండ్ గా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు..? ఎక్కడ..? అనేది అఫిషియల్ గా అనౌన్స్ చేయనున్నారు. అయితే.. ఆదిపురుష్ మూవీ రిలీజ్ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయానికి ప్రభాస్ 10 లక్షల విరాళం అందించారు.
ప్రభాస్ ప్రతినిధులు దంతలూరి సత్యనారాయణ రాజు, వేమారెడ్డి, విక్రమ్, శ్రీనివాసరెడ్డి భద్రాద్రి ఆలాయానికి వెళ్లి ఈవో రమాదేవికి చెక్కు అందచేశారు. శ్రీరాముడి పాత్రలో ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా త్వరలోనే విడుదల కానున్న నేపథ్యంలో ఆ చిత్రం విజయవంతం కావాలని ప్రధాన ఆలయంలోని మూలవిరాట్‌కు, అనుబంధ ఆలయాల్లో ఆంజనేయుడికి, లక్ష్మీతాయారమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. కాగా, ప్రభాస్ విరాళంగా అందించిన 10 లక్షల మొత్తాన్ని అన్నదానం, గోశాల విస్తరణ, ఆలయ అవసరాల కోసం కేటాయించినట్టు ఏఈవో భవానీ రామకృష్ణారావు తెలిపారు.