Wednesday, June 17, 2026
HomeసినిమాNandamuri Balakrishna: బాలయ్య మూవీ ఇంట్రస్టింగ్ న్యూస్

Nandamuri Balakrishna: బాలయ్య మూవీ ఇంట్రస్టింగ్ న్యూస్

నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఓ భారీ చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రంలో బాలయ్యకు జంటగా కాజల్ అగర్వాల్ నటిస్తుంటే.. కూతురుగా శ్రీలీల నటిస్తుండడం విశేషం. అఖండ, వీరసింహారెడ్డి చిత్రాలతో వరుసగా బ్లాక్ బస్టర్ సాధించడంతో ఈ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. దసరాకి ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఇప్పటి వరకు అనిల్ రావిపూడి చేసిన సినిమాలు అపజయం అనేది లేకుండా సక్సెస్ సాధించడంతో ఈ సినిమా కూడా విజయం ఖాయం అనే టాక్ బలంగా వినిపిస్తుంది.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో బాలయ్య ఆర్టీసీ బస్ డ్రైవర్ గా కనిపిస్తాడని ప్రచారం జరిగింది. అయితే.. అందులో వాస్తవం లేదని తెలిసింది. ఫస్ట్ ఆఫ్ మొత్తం ఖైదీగా కనిపిస్తాడని.. తెలంగాణ నేపథ్యంలో ఓ భారీ యాక్షన్ మూవీగా ఈ సినిమా రాబోతుందని సమాచారం. మరో విశేషం ఏంటంటే.. ఈ సినిమాలో బాలయ్య పూర్తిగా తెలంగాణ స్లాంగ్ లో డైలాగ్ లు చెప్పబోతున్నారని టాక్. తన క్యారెక్టర్ లో చాలా పవర్ ఫుల్ గా ఉంటుందట. అరవై ఏళ్ల వ్యక్తిగా బాలయ్య గెటప్ కరెక్ట్ గా సెట్ అయ్యిందని.. ఈ గెటప్ మ్యానరిజమ్ నెక్ట్స్ లెవెల్లో ఉంటాయి అంటున్నారు.

ఇక కథ విషయానికి వస్తే.. పెళ్లైన తర్వాత మధ్య వయసులో ఆవేశంలో చేసిన గొడవల కారణంగా హీరోకి 14 ఏళ్లు శిక్ష పడుతుందట. అలా జైలు నుంచి అరవై ఏళ్ల వయసులో విడుదలైన హీరో జీవితంలో చోటు చేసుకునే సంఘటనల ఆధారంగా ఈ సినిమా సాగుతుందని తెలిసింది. మొత్తానికి బాలయ్య, అనిల్ కలయికలో సినిమా అనగానే ఈ సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుందట. దసరాకి ఈ సినిమా విడుదల అని ప్రకటించారు. మరి.. బాలయ్య హ్యాట్రిక్ సాధిస్తారేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular