పాకిస్థాన్ ఖైభర్ పఖ్తుంఖ్వ రాష్ట్రంలోని వాయువ్య ప్రాంతంలో గిరిజన తెగల మధ్య ఆధిపత్య పోరాటం 60 ఏళ్ళుగా కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం జోక్యం చేసుకున్నా వారి మధ్య సయోధ్య కుదరటం లేదు. తాజాగా ఓ బొగ్గు గని హద్దుల విషయంలో సోమవారం జరిగిన ఘర్షణలో 15 మంది దుర్మరణం పాలయ్యారు. పెషావర్‌కు నైరుతి దిశలో 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోహట్ జిల్లాలోని దర్రా ఆడమ్ ఖేక్ ప్రాంతంలో సన్నీఖేల్, జర్ఘున్ ఖేల్ తెగల మధ్య గని డీలిమినేటషన్ విషయంలో ఘర్షణ జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు, భద్రతా బలగాలు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.
Pakistan: బొగ్గుగని గొడవల్లో 15 మంది మృతి
గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఘర్షణ సందర్భంగా జరిగిన కాల్పుల్లో ఇరువైపులా ప్రాణనష్టం జరిగిందని పోలీసులు పేర్కొన్నారు. ఘటనపై దర్రా ఆడమ్ ఖేల్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. బొగ్గు గని డీలిమిటేషన్‌పై సన్నీఖేల్, జర్ఘున్ ఖేల్ తెగల మధ్య గత రెండు సంవత్సరాలుగా వివాదం కొనసాగుతోంది. అయితే, వివాదాన్ని పరిష్కరించేందుకు అనేక ప్రయత్నాలు చేసినా.. సయోధ్య మాత్రం కుదరడం లేదని అధికారులు పేర్కొన్నారు.