Thursday, June 18, 2026
HomeసినిమాSri Leela: శ్రీలీల కోసం ఆఫర్లు క్యూ కట్టడానికి కారణమిదే! 

Sri Leela: శ్రీలీల కోసం ఆఫర్లు క్యూ కట్టడానికి కారణమిదే! 

శ్రీలీల ఇప్పుడు ఏ ప్రాజెక్టు వైపు చూసినా ఆమె పేరునే వినిపిస్తోంది .. రానున్న కొత్త సినిమాల జాబితాలో ఆమె పేరునే కనిపిస్తోంది. రాఘవేంద్రరావు పరిచయం చేసిన హీరోయిన్ గా శ్రీలీల ‘పెళ్లిసందD’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో ఆమె శ్రీకాంత్ తనయుడితో కలిసి ఆడిపాడింది. ఆ తరువాత సినిమాను ఏ కుర్ర హీరోతో చేస్తుందా అని అంతా ఎదురుచూస్తుంటే, ఏకంగా రవితేజ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ‘ధమాకా’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను కొట్టేసింది.

ఈ సినిమా చేయడం శ్రీలీలకి ప్లస్ అయింది. ఎందుకంటే ఆమె యంగ్ హీరోల జోడీగానే కాదు, సీనియర్ హీరోల సరసన కూడా మెప్పించగలదు. అనే సంకేతాలు ఇండస్ట్రీలోకి వెళ్లాయి. ఇక ‘ధమాకా’ సినిమా ఆమెకి మరో మేలు చేసింది. శ్రీలీల మంచి డాన్సర్ అనే విషయాన్ని ఆ సినిమా నిరూపించింది. మాస్ డాన్సులతోను మెప్పించగలదనే విషయం అందరికీ అర్థమైపోయింది. ఈ కారణంగానే ఆమె ఇప్పుడు వైష్ణవ్ తేజ్ మొదలు పవన్ కల్యాణ్ వరకూ వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతోంది.

ప్రస్తుతం శ్రీలీల చేస్తున్న సినిమాలు ఇక ఒక్కొక్కటిగా థియేటర్లకు రానున్నాయి. ఆమె లైనప్ కూడా మంచి బలంగానే ఉంది. పవన్ .. మహేశ్ .. నితిన్ .. రామ్ .. వైష్ణవ్ తేజ్ వంటి హీరోల సినిమాలతో ఆమె బిజీగా ఉంది. ఇక అనిల్ రావిపూడి సినిమాలో ఆమె బాలయ్యకి కూతురుగా కనిపించనుంది. ఇలా అవకాశాలన్నింటినీ శ్రీలీల ఆక్రమించినట్టుగానే అనిపిస్తోంది. ఈ సినిమాల్లో ఎక్కువ హిట్లు తగిలితే ఆమె టాప్ ప్లేస్ లోకి వెళ్లిపోవడం ఖాయంగానే కనిపిస్తోంది మరి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular