Wednesday, June 17, 2026
HomeసినిమాMalavika: అందాల మందారం ఆశ నెరవేరేనా?

Malavika: అందాల మందారం ఆశ నెరవేరేనా?

తెలుగు తెరకి తమిళ .. మలయాళ భాషల నుంచి చాలామంది అందమైన కథానాయికలు పరిచయమయ్యారు. అలాంటి కథానాయికల జాబితాలో మాళవిక నాయర్ ఒకరుగా కనిపిస్తుంది. మాళవిక నాయర్ మలయాళ సినిమాతో 2012 లోనే తన కెరియర్ ను మొదలుపెట్టింది.  మలయాళంలో వరుస సినిమాలను చేస్తూనే, కోలీవుడ్ ను టచ్ చేసింది. ఆ తరువాత ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాతో తెలుగు తెరకి పరిచయమైంది. తెలుగులో తొలి సినిమాతోనే హిట్ అందుకుంది.

మాళవిక నాయర్ కళ్లతోనే అద్భుతమైన హావభావాలు పలికిస్తుంది. అందమైన ఆమె స్మైల్ కి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఆమె ఏ పాత్రను పోషించినా నటిస్తున్నట్టుగా అనిపించదు. ఆమె స్కిన్ షో చేయడానికి ట్రై చేసిన సందర్భాలు కూడా కనిపించవు. చీరకట్టులోనూ ఆమె ఎంత అందంగా కనిపిస్తుందనేది ‘థ్యాంక్యూ’ సినిమా చూస్తే తెలుస్తుంది. ఇక్కడి ప్రేక్షకులు చూపించే అభిమానానికి తగినట్టుగానే ఆమె కూడా తెలుగు సినిమాలపైనే పూర్తి దృష్టి పెట్టింది.

ఇక్కడ ఎంతమాత్రం గ్యాప్ రాకుండా మాళవిక నాయర్ తన కెరియర్ ను ముందుకు తీసుకుని వెళుతోంది. అయితే సరైన హిట్ మాత్రం ఆమెకి చాలా దూరంగానే ఉండిపోతోంది. ఈ కారణంగానే ఇంకా ఆమెకి రావలసినంత క్రేజ్ రావడం లేదు. ఈ మధ్య కాలంలో వచ్చిన ‘థ్యాంక్యూ’ .. ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ సినిమాలు రెండూ కూడా పరాజయం పాలయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఇటు స్వప్న సినిమాస్ వారు .. అటు నందినీ రెడ్డి ‘అన్నీ మంచి శకునములే’తో ఆమెకి మరో ఛాన్స్ ఇచ్చారు. హిట్ కొట్టాలనే ఆమె ఆశ ఈ సినిమాతోనైనా నెరవేరుతుందేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular