ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. సీఎం కేసీఆర్‌తో కొద్ది సేపటి క్రితం హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. ఢిల్లీలో ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలు, పోస్టింగ్‌లపై కేంద్ర ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ చేస్తున్న పోరాటానికి మిగతా పార్టీల మద్దతును కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్న కేజ్రీవాల్.. ఇప్పటికే పలు పార్టీల అధినేతలతో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌తో సమావేశమై.. మద్దతు కూడగట్టుకునేందుకు వచ్చారు. ఉదయం బేగంపేటకు ప్రత్యెక విమానంలో వచ్చిన ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రివాల్, పంజాబ్ సిఎం భగవంత్ సింగ్ మాన్ లకు మంత్రి పువ్వాడ అజయ్, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఇతర బిఆర్ ఎస్ నేతలు స్వాగతం పలికారు.
అక్కడి నుంచి ఐటిసి కాకతీయ హోటల్ చేరుకున్న కేజ్రివాల్ బృందం రెండు గంటల ప్రాంతంలో ప్రగతి భవన్ చేరుకున్నారు. సిఎం కెసిఆర్… ఇద్దరు ముఖ్యమంత్రులకు స్వాగతం పలికారు. ఆ తర్వాత ముఖ్యమంత్రులు కెసిఆర్ ఆదిత్యం స్వీకరించారు. భోజనం తర్వాత సమావేశంలో పాల్గొన్న సిఎం లు వర్తమాన రాజకీయాలపై చర్చించారు. ఈ సమావేశంలో ఆప్ ఎంపి రాఘవ్ చద్ద, బీఆర్ ఎస్ నేతలు నామ నాగేశ్వర్ రావు, పువ్వాడ అజయ్, జీవన్ రెడ్డి, బాల్క సుమన్ తదితరులు పాల్గొన్నారు.
ఇప్పటికే మమతా బెనర్జీ, ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్, నితీష్ కుమార్, తేజస్వీ యాదవ్‌లతో పాటు మరి కొంత మంది ప్రముఖ నేతలతో కేజ్రీవాల్ సమావేశమయ్యారు. బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా కలిసికట్టుగా పని చేసేందుకు ముందుకు రావాలని పిలుస్తున్నారు.