Thursday, March 12, 2026
Homeస్పోర్ట్స్Malaysia Masters:  చరిత్ర  సృష్టించిన ప్రణయ్

Malaysia Masters:  చరిత్ర  సృష్టించిన ప్రణయ్

భారత షట్లర్ హెచ్ ఎస్ ప్రణయ్  చరిత్ర సృష్టించాడు. కౌలాలంపూర్ లో జరుగుతోన్న మలేషియా మాస్టర్స్-2023 పురుషుల సింగిల్స్ టైటిల్ గెల్చుకున్నాడు. నేడు జరిగిన ఫైనల్లో చైనా ఆటగాడు వెంగ్ హాంగ్ యంగ్ పై 21-19; 13-21; 21-18 తేడాతో విజయం సాధించాడు.

హోరాహోరీగా సాగిన మ్యాచ్ లో తొలి సెట్ ను గెల్చుకున్న ప్రణయ్ రెండో సెట్ ను కోల్పోయాడు. నిర్ణయాత్మక మూడో సెట్  మొదట్లో వెనుకబడినా తర్వాత తేరుకొని ప్రత్యర్థిపై పైచేయి సాధించి అద్భుత విజయం అందుకున్నాడు.

బి.డబ్ల్యూ.ఎఫ్ టోర్నమెంట్లలో 2017 పురుషుల సింగిల్స్ యోనెక్స్ యూఎస్ టైటిల్ గెల్చుకున్న ప్రణయ్ ఆరేళ్ళ తర్వాత మరో సింగిల్స్  టైటిల్ సాధించడం విశేషం. గత ఏడాది 2022 యోనెక్స్ స్విస్ ఓపెన్ ఫైనల్స్ కు చేరినా అక్కడ ఓటమి పాలై రెండో స్థానంతోనే సరిపెట్టుకున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular