Saturday, November 23, 2024
HomeTrending NewsISRO: ఎన్వీఎస్-01 ఉపగ్రహం విజయవంతం

ISRO: ఎన్వీఎస్-01 ఉపగ్రహం విజయవంతం

అంతరిక్ష ప్రయోగాలలో భారత కీర్తి పతాక ఎగురవేస్తున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో మైలురాయి అధిగమించింది. స్వదేశీ నావిగేషన్ వ్యవస్థ ఏర్పాటులో భాగంగా  చేపట్టిన మరో ప్రయోగం విజయవంతమైంది. నేడు  ప్రయోగించిన ఎన్వీఎస్-01 ఉపగ్రహం విజయవంతంగా కక్ష్యలోకి చేరింది. మన దేశ రెండో తరం నావిక్ ఉపగ్రహాల్లో మొదటిదైన ఎన్వీఎస్-01 ఉపగ్రహాన్ని జీఎస్ఎల్వీ రాకెట్ నింగిలోకి మోసుకెళ్లింది. తాజా ప్రయోగంతో భారత భూభాగం చుట్టూ 1500 కిలోమీటర్ల పరిధిలో రియల్ టైమ్ పొజిషనింగ్ సేవలు అందుబాటులోకి రానున్నాయని ఇస్రో చైర్మన్ సోమనాథ్ పేర్కొన్నారు. కాగా, జీఎస్ఎల్వీ-ఎఫ్ 12 రాకెట్ పొడవు 51.7 మీటర్లు, బరువు 420 టన్నులు కాగా, ఎన్వీఎస్-01 ఉపగ్రహం బరువు 2,232 కిలోలు. ఉపగ్రహం జీవిత కాలం 12 సంవత్సరాలు.

ఆదివారం ఉదయం 7:12 గంటలకు జీఎస్ఎల్వీ- ఎఫ్ 12 రాకెట్ ప్రయోగానికి కౌంట్ డౌన్ మొదలైంది.
షార్ లోని రెండో ప్రయోగ వేదిక నుంచి ఈ రాకెట్ ప్రయోగాన్ని ఇస్రో చేపట్టింది. 27:30 గంటలు కొనసాగిన కౌంట్ డౌన్ తర్వాత రాకెట్ నింగికెగిరింది. దాదాపు 20 నిమిషాల పాటు కొనసాగిన ప్రయాణం తర్వాత ఎన్వీఎస్ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి చేర్చింది. భారత రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని తదితరులు ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు.
RELATED ARTICLES

Most Popular

న్యూస్