Thursday, June 18, 2026
HomeసినిమాDevara: 'దేవర' ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతున్న ఆచార్య..?

Devara: ‘దేవర’ ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతున్న ఆచార్య..?

ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో ఓ భారీ పాన్ ఇండియా మూవీ ‘దేవర’ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావడంతో దేవర పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల ఎన్టీఆర్, సైఫ్ ఆలీఖాన్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. అలాగే ఎన్టీఆర్, జాన్వీ కపుర్ పై కూడా కొన్ని సీన్స్ చిత్రీకరించారు. ఈ చిత్రానికి దేవర అనే టైటిల్ ప్రకటించడం.. ఇందులో ఎన్టీఆర్ లుక్ మరింత పవర్ ఫుల్ గా ఉండడంతో దేవర సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయం అనే టాక్ బలంగా వినిపిస్తుంది.

ఇదిలా ఉంటే.. దేవర మూవీ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ టెంపుల్ సెట్ వేసి అందులో యాక్షన్ సీన్స్ ని తెరకెక్కిస్తున్నారు. ఈ ఫోటోలు బయటకు వచ్చాయి. సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే.. ఈ ఫోటోలను చూసిన చాలా మంది నెటిజన్లు ఆచార్యతో లింక్ పెట్టి కామెంట్స్ చేస్తున్నారు. ఆచార్య సినిమాలో ధర్మస్థలి అనే ఫిక్షనల్ టెంపుల్ డిజైన్ చేసి దాని చుట్టూ కథను నడిపించారు. అయితే.. ఆచార్య డిజాస్టర్ అయ్యింది. దీంతో కొరటాల ఇమేజ్ బాగా డ్యామేజ్ అయ్యింది. అయినప్పటికీ కొరటాలతో సినిమా చేసేందుకు ఎన్టీఆర్ ఓకే చెప్పడం విశేషం.

దీంతో కొరటాల ఎంతో కసితో ఈ సినిమా చేస్తున్నారు. అయితే… ఆచార్య తరహాలోనే దేవర మూవీలో టెంపుల్ సెట్.. అందులో యాక్షన్ సీక్వెన్స్ అనేసరికి ఏదో డౌట్ కొడుతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆచార్య, దేవరల కథల నేపధ్యంగా పూర్తిగా భిన్నంగా ఉంటాయని.. ఏమాత్రం సంబంధం లేదని టాక్. ఎన్టీఆర్ ఇచ్చిన ఈ అవకాశాన్ని కొరటాల ఎంత వరకు ఉపయోగించుకుంటారో అనేది ఆసక్తిగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular