Wednesday, October 4, 2023
HomeTrending NewsFish Festival: జూన్ 8,9,10,న ఫిష్ ఫెస్టివల్

Fish Festival: జూన్ 8,9,10,న ఫిష్ ఫెస్టివల్

హైదరాబాద్ జిల్లాలో మృగశిర కార్తి సందర్భంగా 3 రోజుల పాటు ( జూన్ 8,9,10 ) తేదిల్లో ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ -2023 చేపల ఆహార మేళా నిర్వహిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు . NTR గ్రౌండ్స్లో ( కళాభారతి ) వేదికగా నిర్వహిస్తున్న ఈ ఫెస్టైలో వివిధ రకాల చేపలు , రొయ్యలు , పీతలు మరియు ఇతర ఆహార ఉత్పత్తుల వంటకాలు నగర ప్రజలకు అందుబాటులో ఉంటాయి .

ఇప్పటికే దాదాపు 50 మంది మహిళలకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం ఆండ్ హోటల్ మేనేజ్మెంట్ ( NITHM ) లో చేపల వంటకాల తయారీలో శిక్షణ ఇవ్వడం జరిగింది. జిల్లాలోని 30 మంది మహిళల సహకార సంఘములోని సభ్యులు పలు రకాల వంటకాలు ఫిష్ ప్రై , ఫ్రాన్స్ ప్రై , ఫిష్ బిర్యాని , ప్రాన్స్ బిర్యానీ , హోల్ ఫిష్ ప్రై , ఆపోలో ఫిష్ , ఫిష్ పకోడీ ఇతర రకాల చేపల డిష్లు విక్రయాలు చేపడుతారు .

మూడు రోజుల పాటు ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు 40 స్టాల్స్ ఏర్పాటు చేసి విక్రయాలు కొనసాగిస్తాము . ఆక్వేరియా నిర్వాహకులు మరియు ప్రైవేటు ఔత్సాహిక వ్యక్తులకు కూడా స్టాల్స్ కేటాయించబడును . ఒక స్టాలులో విజయ డైరీ ఉత్పత్తులు ప్రదర్శన , విక్రయాలు ఉంటాయి . స్టాల్స్ బుకింగ్ కోసం హైదరాబాద్ జిల్లా మత్స్య శాఖ అధికారి కార్యాలయంలో సంప్రదించగలరు .

ఇట్లు శ్రీమతి . ఎం . చరిత
హైదరాబాద్ జిల్లా మత్స్య శాఖ అధికారి ఫోన్ : 8985788958

NewsDesk
NewsDesk
'ఐ'ధాత్రి న్యూస్ డెస్క్ లో అనుభవజ్ఞులయిన జర్నలిస్టులు, కాపీ ఎడిటర్లు, అనువాదకులు, డిజైనర్లు, డిజిటల్ మీడియా సాంకేతిక నిపుణులు పనిచేస్తుంటారు.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Ramaraju on జనం భాష
Ramaraju on జనం భాష
Radhakrishna Regalla on లోహం- వ్యామోహం
ఆకతాఈ శ్రీ on తెలుగు వెలుగు
Indrasen Bejjarapu on మనసున్న పులి
ఎమ్వీ రామిరెడ్డి on మనసున్న పులి
ఫణీన్ద్ర పురాణపణ్డ on హంపీ వైభవం-1
Radhakrishna Regalla on హంపీ వైభవం-2
Radhakrishna Regalla on హంపీ వైభవం-2
Dr MVJM RAMA PRASAD MANDA on హంపీ వైభవం-2
Radhakrishna Regalla on హంపీ వైభవం-1
తనికెళ్ల శ్రీనివాస్ on రెండు వ్రాతప్రతులూ అపూర్వమే !
కర్రా వెంకటరత్నం on మా నాన్న