థాయిలాండ్ ఓపెన్ లో భారత ఆటగాళ్లు లక్ష్య సేన్, కిరణ్ జార్జ్ లు పురుషుల సింగిల్స్ విభాగంలో క్వార్టర్స్ కు చేరుకున్నారు.
కిరణ్ జార్జ్ 21-11; 21-19 తేడాతో చైనా ఆటగాడు వెంగ్ హాంగ్ యంగ్ పై విజయం సాధించాడు.
మరో మ్యాచ్ లో లక్ష్య సేన్ 21-17; 21-15 తేడాతో చైనా ప్లేయర్ లీ షింగ్ ఫింగ్ ను ఓడించాడు.
కాగా మహిళల సింగిల్స్ లో సైనా నెహ్వాల్, అస్మితా చెలీహా….. పురుషుల డబుల్స్ లో సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి జోడీ తమ ప్రత్యర్థుల చేతిలో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించారు.